
చీర కట్టుకున్నప్పుడు తనకు స్త్రీనన్న భావన కలుగుతుందని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ అన్నారు. ‘‘చీర నా జీవితంలోకి చాలా ఆలస్యంగా ప్రవేశించింది. నేను గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయిని. అక్కడ చీర కట్టుకునే సంప్రదాయం లేదు. నటిని అయ్యాక చీరపై నాకు క్రమంగా ఇష్టం ఏర్పడింది. చీర కట్టుకున్నప్పుడు నా మనసు స్వేచ్ఛా విహంగమై విహరిస్తుంది.
చీరలో ఏదో పవర్ ఉంది’’ అని ఢిల్లీలో టైటాన్ ‘తనేరియా’ హ్యాండ్‌లూమ్స్ షోరూమ్‌ని ప్రారంభించిన సందర్భంగా కంగనా అన్నారు. 31 ఏళ్ల కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని భంబ్లా పర్వత ప్రాంతంలో పుట్టి పెరిగారు. 2006లో ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చారు. బాలీవుడ్‌కి వచ్చాకే కంగనా ఇంగ్లిష్ మాట్లాడ్డం నేర్చుకున్నారు.