హల్వా కావాలా బాబూ! | Kangana Ranaut cooks gajar ka halwa | Sakshi
Sakshi News home page

హల్వా కావాలా బాబూ!

Jan 3 2019 4:20 AM | Updated on Aug 21 2019 10:25 AM

Kangana Ranaut cooks gajar ka halwa - Sakshi

కంగనా రనౌత్‌

న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు ఎక్కవమంది బాలీవుడ్‌ స్టార్స్‌ విదేశాలకు వెళ్లి మస్త్‌ మజా చేస్తే కంగనా రనౌత్‌ మాత్రం సొంతింట్లోనే వేడుక చేసుకున్నారు. గతేడాది కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఓ ఇల్లు కొనుక్కున్నారు. న్యూ ఇయర్‌కు ముందు రోజు కిచెన్‌లోకి వెళ్లి ఆమె గరిటె తిప్పి హల్వా ప్రిపేర్‌ చేశారు. కంగనా వంట చేస్తున్న ఫొటోను ఆమె సోదరి రంగోలి షేర్‌ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. హల్వా కావాలా బాబు? అని అడిగేలా ఉంది కదా కంగనా స్మైల్‌.

మరి.. టేస్ట్‌ ఎలా ఉందనే విషయం మైకుల ముందుకు వచ్చినప్పుడు కంగనానే అడిగి తెలుసుకుందాం. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితం ఆధారంగా కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేసిన ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె అశ్వనీ అయ్యర్‌ తివారి దర్శకత్వంలో ‘పంగా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వీయదర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీని తెరకెక్కించాలని కంగనా అనుకుంటున్నారట.

Advertisement
 
Advertisement
Advertisement