'రూపాయి ఇచ్చి కెమెరా పట్టిన కంగనా' | Sakshi
Sakshi News home page

'రూపాయి ఇచ్చి కెమెరా పట్టిన కంగనా'

Published Wed, Jun 10 2015 7:58 PM

'రూపాయి ఇచ్చి కెమెరా పట్టిన కంగనా' - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ హాలీవుడ్ నటి కంగనా రనౌత్ కెమెరా పట్టింది. తాను నటిస్తున్న చిత్రంలోని ఏడు నిమిషాల నిడివి భాగాన్ని స్వయంగా దర్శకత్వం వహించి చిత్రీకరించింది. ఇమ్రాన్ ఖాన్ సరసన నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో 'కట్టి భట్టి' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఓ సీన్ కోసం ఆమె సినిమాటోగ్రాఫర్ తుషార్ ఆశీర్వాదం తీసుకొని, ఆయనకు ఒక రూపాయి చెల్లించి కెమెరా అందుకున్నారు.

ఏడు నిమిషాలపాటు తీసిన ఈ సన్నివేశం ఒకే టేక్లో ఆమె పూర్తి చేసి అబ్బుర పరిచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శకులు నటుల సామర్థ్యం మీద నమ్మకంతో పని అప్పగించాలే కానీ వారి కోసం ఏమైనా చేయొచ్చని చెప్పింది. అలా తన సామర్థ్యంపై విశ్వాసం ఉన్న దర్శకుడు నిఖిల్ అని అందుకే తనకు ఈ అవకాశం ఇచ్చాడని వివరించింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement