నా అవార్డులు వెనక్కివ్వను: కమల్ హాసన్ | Kamal Hassan pressmeet about national awards, cheekatirajyam | Sakshi
Sakshi News home page

నా అవార్డులు వెనక్కివ్వను: కమల్ హాసన్

Nov 3 2015 1:57 PM | Updated on Sep 3 2017 11:57 AM

నా అవార్డులు వెనక్కివ్వను: కమల్ హాసన్

నా అవార్డులు వెనక్కివ్వను: కమల్ హాసన్

పలువురు సినీ ప్రముఖులు, రచయితలు, ఇతరులు తమకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని తాను సమర్థించబోనని, తనకు వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదని లోకనాయకుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు.

పలువురు సినీ ప్రముఖులు, రచయితలు, ఇతరులు తమకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని తాను సమర్థించబోనని, తనకు వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదని లోకనాయకుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. తన లేటెస్ట్ మూవీ చీకటిరాజ్యం ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విశేషాలతో పాటు ఇతర విషయాలు కూడా పంచుకున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిన ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ అవుతోంది. క్రైం థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మినిమమ్ బడ్జెట్తో అతి తక్కువ రోజుల్లో షూట్ చేశారు. ఒక్క రాత్రిలో జరిగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కమల్ శిష్యుడు రాజేష్ ఎం సెల్వా దర్శకుడు. కిడ్నాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్తో పాటు త్రిష, ప్రకాష్ రాజ్, కిశోర్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత కమల్ చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కావటంతో ఈ సినిమాపై తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement