మరో భారాన్ని భుజానికెత్తుకున్న కమల్ | Kamal Haasan is Directing Sabash Naidu Because TK Rajeev Kumar is Unwell | Sakshi
Sakshi News home page

మరో భారాన్ని భుజానికెత్తుకున్న కమల్

Jun 13 2016 3:55 PM | Updated on Sep 4 2017 2:23 AM

మరో భారాన్ని భుజానికెత్తుకున్న కమల్

మరో భారాన్ని భుజానికెత్తుకున్న కమల్

సాహసం, వైవిద్యం, విభిన్నత వంటి అంశాలే పరమావధిగా ఎప్పటికప్పుడు తనను నిత్యనూతనంగా పరిచయం చేసుకునే విలక్షణ ప్రముఖ నటుడు కమల్ హాసన్ మరోసాహసానికి దిగాడు.

చెన్నై: సాహసం, వైవిద్యం, విభిన్నత వంటి అంశాలే పరమావధిగా ఎప్పటికప్పుడు తనను నిత్యనూతనంగా పరిచయం చేసుకునే విలక్షణ ప్రముఖ నటుడు కమల్ హాసన్ మరోసాహసానికి దిగాడు. తన చిత్రానికే తానే దర్శకత్వం వహించుకునే బాధ్యతలు భుజాన వేసుకున్నారు. తన చిత్ర దర్శకుడు అస్వస్థతకు గురవ్వడంతో ఆయన ఈ పని చేస్తున్నారు. కమల్ తాజాగా నటిస్తున్న చిత్రం శబాష్ నాయుడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు.

దీంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి ఉంది. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి చేసి సినిమా ప్రేక్షకులముందుకు తీసుకురావాల్సిన నేపథ్యంలో ఇప్పటికే దర్శకత్వంలో పట్టున్న కమల్.. ఈ చిత్రానికి ఎలాంటి అవాంతరం కలగకుండా ఉండేందుకు దర్శకత్వ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. 'మా దర్శకుడు రాజీవ్ బాగా అస్వస్థతతో ఉన్నారు.

లాస్ ఎంజెల్స్లో మేం షూటింగ్ జరుపుకుంటున్న నాలుగో రోజు ఇలా జరగడం దురదృష్టం. ఆయన లైమ్ డిసీజ్కు లోనయ్యారు. ఉత్తర అమెరికా, యూరప్ లో మాత్రమే వచ్చే అత్యంత అరుదైన వ్యాధి ఇది. అందుకే నేను నా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను' అని కమల్ సోమవారం ఒక ప్రకటనలో చెప్పారు. అలాగే లాస్ ఎంజెల్స్ లోని ప్రముఖ ఆస్పత్రిలో తమ డైరెక్టర్ వైద్య చికిత్స పొందుతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement