భారతీయుడు 2 షూటింగ్ అప్‌డేట్‌

Kamal Haasan Bharatheeyudu 2 Shooting Update - Sakshi

ఇటీవల 2.ఓ తో సంచలనం సృష్టించిన దర్శకుడు శంకర్‌ తన తదుపరి చిత్ర పనులు ప్రారంభించాడు. కమల్‌ హాసన్‌ హీరోగా ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన భారతీయుడు 2 సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు చిత్రయూనిట్‌. కొత్త ఏడాది జనవరిలో భారతీయుడు 2 షూటింగ్‌ను చెన్నైలో ప్రారంభించనున్నారు.

తరువాత పొల్లాచ్చిలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసి మేజర్‌ షెడ్యూల్‌ కోసం ఉక్రెయిన్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తయితే 2020 జనవరిలో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా తరువాత కమల్‌ పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పునున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో భారతీయుడు 2 భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top