యువహీరో కోసం పాట పాడిన కమల్! | Sakshi
Sakshi News home page

యువహీరో కోసం పాట పాడిన కమల్!

Published Sun, Feb 7 2016 10:56 PM

యువహీరో కోసం పాట పాడిన కమల్!

నటన, రచన, దర్శకత్వం, గానం, నిర్మాణం.. ఇలా సినిమా పరిశ్రమలోని 24 శాఖలపై మంచి పట్టు సంపాదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్‌హాసన్. గాయకునిగా ఇప్పటివరకూ కమల్ తాను నటించిన చిత్రాలకు చాలా పాటలు పాడారు. తొలిసారి వేరే హీరోకి ఆయన తన గాత్రం అందించారు. రాజ్‌దురై దర్శకత్వంలో తమిళ సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ (‘కడలి’ ఫేమ్) హీరోగా ‘ముత్తురామలింగం’ అనే  చిత్రం రూపొందుతోంది. సంగీత జ్ఞాని ఇళయరాజా ఈ చిత్రానికి స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో హీరో పరిచ య గీతానికి ఓ గంభీరమైన గొంతు కావాలనుకున్నారు ఇళయరాజా. వెంటనే  కమల్‌ను సంప్రతించారు. ఇప్పటికే ఇళయరాజా సంగీతంలో పలు చిత్రాలకు పాటలు పాడిన కమల్ ఆయన మీద గౌరవంతో వెంటనే ఒప్పుకున్నారు. కమల్ పాడగా ఈ పాటను ఇటీవల రికార్డ్ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement