‘యన్‌.టి.ఆర్‌’లో జూనియర్‌ ఎందుకు నటించలేదంటే..!

Kalyan Ram Clarifies Why Jr NTR Is Not A Part Of The NTR Biopic - Sakshi

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న బయోపిక్‌ మూవీ యన్‌.టి.ఆర్‌. నందమూరి బాలకృష్ణ తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌, సుమంత్‌, రానాలతో పాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించే అవకాశం ఉందన్న టాక్‌ వినిపించింది. తాజాగా ఈ విషయంపై కల్యాణ్ రామ్‌ స్పందించారు.

యన్‌.టి.ఆర్‌లో తారక్‌ నటించలేదని క్లారిటీ ఇచ్చారు. ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను తీసుకోవాలని భావించినా.. ఎన్టీఆర్‌ స్టార్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్న పాత్రలో తారక్‌ను చూపించటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే బాలకృష్ణ.. యన్‌.టి.ఆర్‌లో తారక్‌ను తీసుకోలేదన్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమాను వారాహి చలనచిత్రం, విబ్రీ మీడియా లతో కలిసి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top