'సర్వం తాళమయం'కు కళాతపస్వి ప్రశంసలు

Kalatapaswi K Viswanath Compliments Rajiv Menon SaravamThaalaMayam - Sakshi

శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్, రాజీవ్ మీనన్ రూపొందించిన ‘సర్వం తాళ మయం’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన చూసిన ఆయన ‘చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్ కి నా ఆశీర్వాదాలు’ అని అభినందించి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.

అలాగే ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ ఈ చిత్రాన్ని చూసి రాజీవ్ మీనన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించిన ఈ సినిమా మార్చ్ 8 న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతోంది. జీవీ ప్రకాష్, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నేడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత లత తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top