ఆ సెంటిమెంట్ నిజం కాదు! | Kajal dress sentiment on First Day shoot | Sakshi
Sakshi News home page

ఆ సెంటిమెంట్ నిజం కాదు!

Jul 21 2016 11:23 PM | Updated on Oct 30 2018 5:58 PM

ఆ సెంటిమెంట్ నిజం కాదు! - Sakshi

ఆ సెంటిమెంట్ నిజం కాదు!

కాజల్ అగర్వాల్ తొలి సన్నివేశంలో తెలుపు రంగు డ్రెస్సులో కనిపిస్తే ఆ సినిమా హిట్. ఇది చాలామంది నమ్మకం.

కాజల్ అగర్వాల్ తొలి సన్నివేశంలో తెలుపు రంగు డ్రెస్సులో కనిపిస్తే ఆ సినిమా హిట్. ఇది చాలామంది నమ్మకం. ఎందుకంటే ఇంట్రడక్షన్ సీన్‌లో ఈ బ్యూటీ కనిపించిన సినిమాలు హిట్టయ్యాయట. ఇదే విషయం గురించి కాజల్ అగర్వాల్ దగ్గర ప్రస్తావిస్తే -‘‘దీని గురించి కొంతమంది నాతో అన్నారు. ఏదైనా పర్టిక్యులర్ కలర్ అదృష్టం తెస్తుందనే విషయాన్ని నేను నమ్మను.
 
 వైట్ డ్రెస్ వేసుకుంటే సినిమా హిట్ అవుతుందని పని గట్టుకుని నేను వేసుకున్నది లేదు. అసలు వేరేవాళ్లు చెప్పేవరకూ నాకా విషయం తెలియదు. వైట్ డ్రెస్‌లో నేను కనిపించిన ఇంట్రడక్షన్ సీన్స్ అనుకుని తీసినవి కాదు. కాకతాళీయంగా ఆ డ్రెస్ వేసుకున్నాను. అందుకని మొదటి సన్నివేశంలో నేను వైట్ డ్రెస్‌లో కనిపిస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ నిజం కాదు. మంచి కథ, టేకింగ్, కథకు తగ్గ నటీనటులు కుదిరితే సినిమా సక్సెస్ అవుతుంది. అంతేకానీ, సెంటిమెంట్స్ ని నమ్ముకుని పిచ్చి కథతో సినిమా తీస్తే ఆడదు’’ అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement