దాన్ని కూడా భూతద్దంలో చూస్తారా? | Kajal Aggarwal visits Sri Kalahasti temple | Sakshi
Sakshi News home page

దాన్ని కూడా భూతద్దంలో చూస్తారా?

Feb 7 2014 3:25 AM | Updated on Apr 3 2019 6:23 PM

దాన్ని కూడా భూతద్దంలో చూస్తారా? - Sakshi

దాన్ని కూడా భూతద్దంలో చూస్తారా?

శ్రీకాళ హస్తీశ్వర దర్శనం అంటేనే ప్రత్యేకం. ముఖ్యంగా పెళ్లి ఆశలు గలవారే తమ దోషాలను తొలగించుకోవడానికి పరమేశ్వరుని వరాలు పొందడానికి శ్రీకాళహస్తిని

శ్రీకాళ హస్తీశ్వర దర్శనం అంటేనే ప్రత్యేకం. ముఖ్యంగా పెళ్లి ఆశలు గలవారే తమ దోషాలను తొలగించుకోవడానికి పరమేశ్వరుని వరాలు పొందడానికి శ్రీకాళహస్తిని దర్శించుకుంటారన్నది ప్రతీతి. నయనతార, సమంత నుంచి చాలా మంది హీరోయిన్లు శ్రీకాళహస్తిలో విశేష పూజలు నిర్వహించారు. ఆ ఆలయాన్ని నటి కాజల్ దర్శించుకోవడంతో ఈ బ్యూటీపై కూడా రకరకాల ప్రచారం జరుగుతోంది.
 
ముఖ్యంగా ఈ భామకంటే ముందు చెల్లెలు పెళ్లి చేసుకోవడంతో ఈమె దోష నివారణ కోసం శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాజల్‌తోపాటు ఆమె తల్లిదండ్రులు కూడా కాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్నారు. కాగా కాజల్ అగర్వాల్‌పై జరుగుతున్న ప్రచారంపై ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. శ్రీకాళహస్తిలోని ఆలయ దర్శనానికి వెళ్లడాన్ని కూడా భూతద్దంలో చూపుతున్నారంటూ రుసరుసలాడారు.
 
 ఆమె మాట్లాడుతూ తనపై జరుగుతున్న ప్రచారం చూసి పలువురు తనను అడుగుతున్నారన్నారు. ఆలయానికెందుకెళతారు? దైవ దర్శనం చేసుకోవడం కూడా తప్పా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తన కుటుంబానికి, తన వృత్తికి మంచి జరగాలని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నట్లు వివరించారు. అంతకన్నా మరే కారణం లేదని స్పష్టం చేశారు. సినిమా విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో నటిస్తున్నట్లు తెలిపారు. తమిళంలో ఒక భారీ చిత్రంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. బాలీవుడ్ విషయానికొస్తే అక్కడ అవకాశాల్లేకపోయినా తాను బిజీనే అన్నారు. కారణం ఫ్యాషన్ షో కార్యక్రమాలకు తనకు భలే డిమాండ్ ఉందని కాజల్ అంటున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement