ఇలయదళపతితో మూడోసారి.. | kajal aggarwal third time acting with Ilayadalapati Vijay | Sakshi
Sakshi News home page

ఇలయదళపతితో మూడోసారి..

Dec 17 2016 1:38 AM | Updated on Oct 30 2018 5:58 PM

ఇలయదళపతితో మూడోసారి.. - Sakshi

ఇలయదళపతితో మూడోసారి..

ఇలయదళపతి విజయ్‌తో మూడు సార్లు హీరోయిన్ గా నటించే లక్కీచాన్్స ఇప్పటివరకూ ఏ నటికీ దక్కలేదు.

ఇలయదళపతి విజయ్‌తో మూడు సార్లు హీరోయిన్ గా నటించే లక్కీచాన్్స  ఇప్పటివరకూ ఏ నటికీ దక్కలేదు. అలాంటి అదృష్టం కాజల్‌అగర్వాల్‌కు దక్కిందన్నది తాజా సమాచారం. నిజానికి లేట్‌గా అయినా లేటెస్ట్‌గా హిట్‌ పెయిర్‌గా పేరు తెచుకున్న జంట విజయ్, కాజల్‌. వారిద్దరు ఇంతకు ముందు తుపాకీ, జిల్లా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆ తరువాత తాజాగా మరోసారి రొమాన్్సకు సిద్ధం అవుతున్నారని కోలీవుడ్‌ వర్గాల టాక్‌. విజయ్‌ ప్రస్తుతం తన 60వ చిత్రం భైరవాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. విజయా ప్రొడక్షన్్స సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి భరతన్ దర్శకుడు. కీర్తీసురేష్‌ నాయకి. చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. భైరవా సంక్రాంతికి బరిలోకి దిగనున్నారు.

విజయ్‌ తన 61వ చిత్రానికి తయారవుతున్నారు. అట్లీ దర్శకత్వంలో శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించనున్న భారీ చిత్రంలో విజయ్‌ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. తెరి వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తరువాత విజయ్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇందులో నయనతారను నాయకిగా ఎంపిక చేయాలన్న ప్రయత్నాలు జరిగాయని తెలిసింది. అయితే అమ్మడు ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం డిమాండ్‌ చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం.

తాజాగా నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉంటుందట. ఆ పాత్ర కోసం బాలీవుడ్‌ బ్యూటీనొకరిని ఎంపిక చేసే పనిలో ఉన్నారని టాక్‌ వినిపిస్తోంది.  ఈ చిత్రం నూతన సంవత్సరం సందర్భంగా జనవరిలో సెట్‌పైకి వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement