మళ్లీ వైఫ్‌గా...

మళ్లీ వైఫ్‌గా... - Sakshi


నుదుట కుంకుమ బొట్టు... మెడలో తాళిబొట్టు... హుందాగా చీరకట్టు... కొత్తగా కనిపిస్తూ కాజల్‌ అగర్వాల్‌ కనికట్టు చేస్తారట. ఎందులోనంటే... అజిత్‌ ‘వివేకం’లో. రీసెంట్‌గా రిలీజైన ‘నేనే రాజు నేనే మంత్రి’లో హీరో వైఫ్‌ క్యారెక్టర్‌లో కనిపించిన కాజల్, ఈ సినిమాలోనూ హీరో వైఫ్‌గా కనిపించనున్నారు. అయితే... రెండు క్యారెక్టర్స్‌ మధ్య చాలా డిఫరెన్స్‌ ఉందట! ‘‘కళలను అభిమానించే వ్యక్తిగా, ‘వివేకం’లో టిపికల్‌ సౌతిండియన్‌గా నటించా. నటనకు మంచి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌’’ అన్నారు కాజల్‌. ఇందులో ఒకటి, రెండు పాటల్లో తప్పితే... సినిమా అంతా ఫుల్‌ హ్యాండ్స్‌ బ్లౌజులు, ట్రెడిషనల్‌ శారీల్లో కాజల్‌ కనిపిస్తారట.ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో యాక్షన్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా అజిత్‌ మేకోవర్, స్టైల్‌కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో ఆయన సిక్స్‌ ప్యాక్‌తో కనిపించనున్నారు. యాక్షన్‌తో పాటు హ్యూమన్‌ ఎమోషన్స్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు కాజల్‌. తమిళంలో ‘వివేగం’గా రూపొందిన ఈ సిన్మాను వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత నవీన్‌ శొంటినేని (నాని) తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హిందీ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా, అక్షరా హాసన్‌ ముఖ్యతారగా నటించిన ఈ సినిమాకు శివ దర్శకుడు. ఈ నెల 24న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top