అందుకు కాజోల్‌ రూ.2 కోట్లు అడిగిందట! | Kajal Aggarwal has demanded Rs 2 crore for Mar 2. | Sakshi
Sakshi News home page

అందుకు కాజోల్‌ రూ.2 కోట్లు అడిగిందట!

Jul 24 2017 2:08 AM | Updated on Oct 30 2018 7:36 PM

అందుకు కాజోల్‌ రూ.2 కోట్లు అడిగిందట! - Sakshi

అందుకు కాజోల్‌ రూ.2 కోట్లు అడిగిందట!

కాజల్‌ అగర్వాల్‌కు టాలీవుడ్‌లో అంత డిమాండ్‌ లేకపోయినా కోలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉందని చెప్పవచ్చు.

తమిళసినిమా:  కాజల్‌ అగర్వాల్‌కు టాలీవుడ్‌లో అంత డిమాండ్‌ లేకపోయినా కోలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉందని చెప్పవచ్చు. కారణం ఇక్కడ ఇద్దరు టాప్‌ హీరోలు విజయ్,అజిత్‌లతో విడివిడిగా ఏకకాలంలో రొమాన్స్‌ చేస్తోంది. వీటిలో అజిత్‌ సరసన తొలిసారిగా నటిస్తున్న వివేగం చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని ఆగస్ట్‌ 10వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

ఈ చిత్రంపై అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. ఇక తుపాకీ, జిల్లా చిత్రాల తరువాత విజయ్‌తో ముచ్చటగా మూరోసారి నటిస్తున్న చిత్రం మెర్సల్‌. ఇందులో ఈ భామతో పాటు, సమంత, నిత్యామీనన్‌ కూడా విజయ్‌తో డ్యూయెట్లు పాడుతున్నారు. తాజాగా కాజల్‌కు మరో అవకాశం తలుపు తట్టింది. ధనుష్‌తో జోడీ కట్టే అవకాశం రావడంతో ఎగిరిగంతేసిందట.ఎందుకుంటే ఇంతకు ఈ జంట బాలాజీమెహన్‌ దర్శకత్వంలో కలిసి నటించిన మారి చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్నే నమోదు చేసుకుంది.

దీంతో ధనుష్‌ మారి–2కు రెడీ అవుతున్నారు. ఇందులోనూ మారి చిత్రంలో నటించిన నటీనటులనే నటింపజేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.అందులో భాగంగా కథానాయకిగా కాజల్‌అగర్వాల్‌ను సంప్రదించగా ఆ బ్యూటీ ఓకే అన్నదట.అయితే పారితోషికం మాత్రం రూ.రెండు కోట్లు డిమాండ్‌ చేసిందని సమాచారం.ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌లో నిర్మించడానికి సిద్ధమైన నటుడు ధనుష్‌ కాజల్‌ రెండు కోట్లు పారితోషికం డిమాండ్‌ చేయడంతో ఆమె అడిగినంత ఇచ్చి నటింపచేద్దామాలేక వేరే నటిని ఎంపిక చేద్దామాఅన్ని మీమాంసలో పడ్డట్టు కోలీవుడ్‌ వర్గాల టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement