కబీర్‌సింగ్‌ డేట్‌ ఫిక్స్‌ | Kabir Singh trailer inspires hilarious memes | Sakshi
Sakshi News home page

కబీర్‌సింగ్‌ డేట్‌ ఫిక్స్‌

May 14 2019 3:47 AM | Updated on May 14 2019 3:47 AM

Kabir Singh trailer inspires hilarious memes - Sakshi

షాహిద్‌ కపూర్‌

విజయ్‌ దేవరకొండ, షాలినీపాండే జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఈ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ఈ సినిమాని ఇతర భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. హిందీలో షాహిద్‌ కపూర్‌ హీరోగా ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ‘అర్జున్‌రెడ్డి’కి దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగానే ‘కబీర్‌ సింగ్‌’ ని తెరకెక్కించడం విశేషం. భూషణ్‌ కుమార్, మురాద్‌ ఖేతాని, క్రిషణ్‌ కుమార్, అశ్విన్‌ వర్డే నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘అర్జున్‌రెడ్డి’లోని అనుభూతిని ఎక్కడా మిస్‌ కాకుండా ‘కబీర్‌సింగ్‌’ తెరకెక్కించారని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. జూన్‌ 21న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం బాలీవుడ్‌లో ఎంతటి సెన్సేషన్‌ సృష్టిస్తుందే వేచి చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement