'కబాలి' కోసం బలి! | Kabali: Shocking! Rajinikanth fans do animal sacrifice to avoid ward off evil spirit | Sakshi
Sakshi News home page

'కబాలి' కోసం బలి!

Aug 8 2016 8:26 PM | Updated on Sep 12 2019 10:40 AM

'కబాలి' కోసం బలి! - Sakshi

'కబాలి' కోసం బలి!

సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' కళ్లు చెదిరే రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.రిలీజ్కు ముందే భారీ హైప్ను క్రియేట్ చేసిన ఈ సినిమా కథ పరంగా కాస్త నిరాశపరచినా.. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' కళ్లు చెదిరే రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. రిలీజ్కు ముందే భారీ హైప్ను క్రియేట్ చేసిన ఈ సినిమా కథ పరంగా కాస్త నిరాశపరచినా.. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దాంతో తలైవా ఫ్యాన్స్ సంబరాలు జరుపుకొంటున్నారు.

సూపర్ స్టార్ను అభిమానించేవారికన్నా ఆరాధించేవారి సంఖ్యే ఎక్కువన్న విషయం తెలిసిందే. ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు.. రజనీ విగ్రహాలకు పాలాభిషేకాలు, హారతులు కామన్. ఈసారి మరో అడుగు ముందుకేసి జంతు బలికి పూనుకున్నారు రజనీ ఫ్యాన్స్.

కబాలి భారీ సక్సెస్ అయ్యి, రికార్డు కలెక్షన్లు రాబడుతున్నందున దిష్టి తగలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మేకలను దేవుడికి బలి ఇస్తున్నారట ఫ్యాన్స్. ఎలాంటి చెడు చూపు సినిమా కలెక్షన్లపై పడకుండా, ఎటువంటి చెడు జరుగకుండా ఉండాలని కోరుకుంటూ మేకలను బలిచ్చే పనిలో ఉన్నారు సూపర్ స్టార్ వీరాభిమానులు. అయితే మూగజీవాలను ఇలా హింసించడం పట్ల జంతు ప్రేమికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్ అనాలోచిత కార్యక్రమాలను ఆపేందుకు తలైవానే నడుం బిగించాలని పలువురు కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement