'అతనితో ఇంటర్వ్యూ చాలా వరెస్ట్‌' | Justin Bieber my worst interview ever: Chelsea Handler | Sakshi
Sakshi News home page

'అతనితో ఇంటర్వ్యూ చాలా వరెస్ట్‌'

Jan 26 2016 9:43 AM | Updated on Aug 20 2018 6:18 PM

'అతనితో ఇంటర్వ్యూ చాలా వరెస్ట్‌' - Sakshi

'అతనితో ఇంటర్వ్యూ చాలా వరెస్ట్‌'

యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ ప్రపంచంలో పెద్ద స్టార్ సింగర్‌ కావొచ్చు కానీ, అతన్నితో తాను చేసిన ఇంటర్వ్యూ మాత్రం ఓ పీడకల అంటోంది చెల్సియా హండ్లర్.

లాస్‌ఏంజిల్స్‌: యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ ప్రపంచంలో పెద్ద స్టార్ సింగర్‌ కావొచ్చు కానీ, అతనితో తాను చేసిన ఇంటర్వ్యూ మాత్రం ఓ పీడకల అంటోంది చెల్సియా హండ్లర్. టీవీ ప్రజెంటర్ అయిన ఆమె 2015లో బీబర్‌ను ఇంటర్వ్యూ చేసింది. అప్పట్లో అతని వయస్సు 15 ఏండ్లే.

కానీ అతను తనను ఫ్లర్ట్‌ (సరసమాడటానికి) చేయడానికి ప్రయత్నించాడని, దీంతో తాను చాలా అసౌకర్యానికి గురయ్యానని ఆమె తెలిపింది. 'చెల్సియా లేట్‌లీ' షోలో భాగంగా అతన్ని చేసిన ఇంటర్వ్యూనే తన జీవితంలో చేసిన అత్యంత చెత్త ఇంటర్వ్యూ అని పేర్కొంది. 'అతను తనదైనశైలిలో గిమ్మిక్కులు చేశాడు. అతను మీతో సరసమాడటానికి ప్రయత్నిస్తే ఓ పిల్ల ఆకతాయి అని మీరు తోసిపుచ్చవచ్చు. కానీ నాకు అతను అలా అనిపించలేదు. చాలా అసౌకర్యంగా తోచింది' అని ఆమె చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement