
విజయేంద్ర ప్రసాద్ కథతో రాజమౌళి 2007లో తెరకెక్కించిన యమదొంగ చిత్రం కమర్శియల్‌గానూ మ్యూజికల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది.
యమదొంగ చిత్రానికి తమిళ తెరపైకి రావడానికి వేళయ్యింది. బాహుబలి చిత్రం ఫేమ్ ఎస్‌ఎస్.రాజమౌళి బాహుబలి చిత్రానికి ముందు తెలుగులో తన దర్శకత్వంలో బ్రహ్మాండంగా చెక్కిన చిత్రం యమదొంగ. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగానూ ప్రముఖ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలోనూ నటించిన ఈ చిత్రంలో నటి కుష్బూ, ప్రియమణి, మమతామోహన్‌దాస్, రంభ మేలి కలయికలో రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు.
విజయేంద్ర ప్రసాద్ కథతో రాజమౌళి 2007లో తెరకెక్కించిన యమదొంగ చిత్రం కమర్శియల్‌గానూ మ్యూజికల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది. సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో భూలోకం, యమలోకంలో జరిగే జనరంజకంగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో విజయన్ పేరుతో అనువాదమైంది. దీనికి అనువాద రచయితగా ఏఆర్‌కే.రాజా పనిచేశారు. దీన్ని తమిళంలో ఓం శ్రీసప్త కన్నియమ్మన్ పతాకంపై ఎం.జయకీర్తి, రేవతీ మేఘవన్నన్ అనువదించారు. కాగా అనువాద కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విజయన్ చిత్రాన్ని శ్రీ మనీశ్వర మూవీస్ సంస్థ విడుదల హక్కులను పొంది జనవరి 3న తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది.