చరణ్‌ నువ్వు తప్ప ఎవరూ చేయలేరు : తారక్‌ | Jr NTR Commented On Rangasthalam Movie | Sakshi
Sakshi News home page

చరణ్‌ నువ్వు తప్ప ఎవరూ చేయలేరు : తారక్‌

Apr 1 2018 9:59 PM | Updated on Apr 1 2018 10:07 PM

Jr NTR Commented On Rangasthalam Movie - Sakshi

సాక్షి, హైదారాబాద్‌ : రంగస్థలం బ్లాక్‌బస్టర్‌ అయిన నేపథ్యంలో సినిమాపై ప్రసంశల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ చేరారు. తాను ఇప్పుడే రంగస్థలం చూశానని చెప్పిన తారక్‌, రామ్‌ చరణ్‌పై పొగడ్తలు గుప్పించారు. సినిమాలో చరణ్‌ చేసిన నటనకు అభినందనలు, ప్రశంసలు అందుకునే అర్హత ఉందని వ్యాఖ్యానించారు. తన తరపునుంచి కూడా అభినందనలు తెలిపారు. చిట్టిబాబు పాత్రను చరణ్‌ కంటే ఎవరూ బాగా చేయలేరంటూ ఆకాశానికెత్తేశారు.

దర్శకుడు సుకుమార్ తనదైన శైలిలో అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని, దర్శకత్వం అద్భుతంగా ఉందన్నారు. ఆకాలం నాటి పరిస్థితులను కళ్లలకు కట్టినట్లు చూపించారని అన్నారు. హీరోయిన్‌ సమంతకు అభినందనలు తెలిపారు. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌, మైత్రీ మూవీ మేకర్స్‌.. ఇలా రంగస్థలం బృందంలోని ప్రతిఒక్కరు ఉండటానికి అద్భుతంగా చేశారని పొగడ్తల వర్షం కురిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement