నేను సినిమాల్లోకి రావడం అమ్మకు ఇష్టంలేదు

Jhanvi Kapoor First Interview With Vogue Magazine - Sakshi

అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ తన తొలి చిత్రం ‘ధడక్‌’తో వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. తొలి సినిమా విడుదల కాకముందే భారీ ఇమేజ్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా జులైలో విడుదల కానున్న సందర్భంగా ప్రముఖ మ్యాగజైన్‌  ‘వోగ్’కు  తొలి ఇంటర్వ్యూనిచ్చింది. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ జోహర్‌ జాన్వీ ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ సందర్భంగా జాన్వీ ముఖచిత్రంతో కూడిన కవర్ పేజీ విడుదలైంది. దీనిని జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేస్తూ ‘ఈ ఫొటోను షేర్ చేయడాన్ని ఎంతో ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఇది మ్యాగజైన్ కోసం నా తొలి కవర్ ఫొటో. ‘వోగ్ ఇండియా’ నాకు ఇంతటి ప్రత్యేక అనుభూతిని కలిగించినందుకు థ్యాంక్స్’ అని తెలిపారు.  

ఇంటర్వ్యూలో జాన్వీ చెప్పిన కబుర్లు... ‘అమ్మ దుబాయ్‌లో జరిగే వివాహానికి హాజరవ్వడం కోసం లగేజ్‌ను ప్యాక్‌ చేసుకుంటుంది. ఆ సమయంలో నాకు నిద్ర పట్టకపోవడంతో నన్ను నిద్రపుచ్చమని అమ్మను అడిగాను. కానీ తాను పనిలో ఉండటం వల్ల నా దగ్గరకు రాలేదు. తర్వాత అమ్మ వచ్చి చూసేసరికి నేను నిద్రపోతున్నాను. అయినా అమ్మ వచ్చి నా పక్కన కూర్చుని నా తల నిమిరింది. ఖుషీ తన గురించి తాను చూసుకుంటుంది. కానీ నేను అలా కాదు. నాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అమ్మే దగ్గరుండి చూసుకునేది.’ అని తెలిపారు.

ఇతరులను చూసి ఈర్ష్య పడటం, అనవసరంగా ఇతరుల మీద కోప్పడం వంటివి చేయకూడదని తన తల్లి చెప్పిందని జాన్వీ పేర్కొన్నారు. తన తొలి చిత్రం ‘ధడక్‌’కు సంబంధించిన ప్రతి విషయాన్ని అమ్మే దగ్గరుండి చూసుకునేదని తెలిపారు. ఈ చిత్రంలోని 25 నిమిషాల నిడివి ఉన్న పుటేజ్‌ను శ్రీదేవి చూసిందన్నారు.

ప్రస్తుతం తమ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల గురించి అడగ్గా... ‘అమ్మ మరణించిన తర్వాత మా కుటుంబమంతా తిరిగి ఒక్కటయ్యింది. అన్నయ్య అర్జున్‌ కపూర్‌, సోదరి అన్షులా కపూర్‌ తమని చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. అయితే తమ జీవితాల్లో అమ్మ లేని లోటు ఎప్పటికి అలానే ఉంటుందన్నారు. నేను ఇంకా చిన్నపిల్లలానే ఉంటాను. కానీ ఖుషీ అలా కాదు. తనను తాను చూసుకోవడమే కాకుండా నన్ను కూడా ఖుషీనే చూసుకుంటుంది. ఇప్పుడు నాకు నిద్ర పట్టకపోతే అప్పుడప్పుడు తనే నన్ను నిద్ర పుచ్చుతుందని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top