భారీ బడ్జెట్ చిత్రంలో హీరో జయంరవి? | Jayam Ravi roped in for Sundar C's 'Sangamittra'? | Sakshi
Sakshi News home page

భారీ బడ్జెట్ చిత్రంలో హీరో జయంరవి?

Aug 29 2016 2:18 AM | Updated on Sep 4 2017 11:19 AM

భారీ బడ్జెట్ చిత్రంలో హీరో జయంరవి?

భారీ బడ్జెట్ చిత్రంలో హీరో జయంరవి?

భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్న కథానాయకుడు జయంరవి అన్నది తాజాగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం.

భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్న కథానాయకుడు జయంరవి అన్నది తాజాగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీతేనాండాళ్ ఫిలింస్ తన వందవ చిత్రంగా భారీ చారిత్రక కథా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు సుందర్.సీ దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్న ఈ బ్రహ్మాండ చిత్రంలో హీరో ఎవరన్న విషయంపై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ఇళయదళపతి విజయ్, సూర్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
 
  దాదాపు ఏడాది పాటు చిత్రీకరణ జరుపుకునే ఈ చిత్రంలో నటించడానికి పైన చెప్పిన ముగ్గురు నటులు సాహసం చేయలేదు. కారణం కథ నచ్చినా అని కాల్‌షీట్స్ కేటాయించలేని పరిస్థితి అని సమాచారం. ఇప్పుడీ చిత్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు జయంరవి హీరోగా నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. నవంబర్‌లో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటవర్గం, సాంకేతిక బృందం ఎంపిక జరుగుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలను, సబు శిరిల్ కళాదర్శకత్వాన్ని, కమల్‌కన్నన్ వీఎఫ్‌ఎక్స్ బాధ్యతలను నిర్వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement