హైకోర్టుకు చేరిన ‘జయలలిత బయోపిక్‌’

jayalalithaa Niece Moves HC On Thalaivi Movie To Ban - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌పై అప్పుడే వివాదాలు చుట్టుముట్టాయి. సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ శుక్రవారం మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. బయోపిక్‌ల ద్వారా జయలలిత కొందరు ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.  కాగా  ‘తలైవి’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ కథానాయక కంగనా రనౌత్‌ జయ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది.

ఎఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై ప్రారంభానికి ముందే నుంచే బోలెడంత హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ చిత్రంలో ‘అమ్మ’గా మారడానికి కంగనా కూడా బాగానే కష్టపడుతున్నారు. జయ పాత్ర కోసం ఇటీవల అమెరికాలో మేకప్‌ టెస్ట్‌ చేయించుకున్న ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా పొందుతున్నారు. జయలలితలా తెరమీద కనిపించేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు కూడా తీసుకుంటున్నారు. అయితే చిత్ర షూటింగ్‌ చివరి దశలో ఉన్న సమయంలో దీపా కోర్టును ఆశ్రయించడంతో సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు జయలలిత జీవిత చరిత్రపై మరికొంతమంది దర్శకులు వెబ్‌ సిరీస్‌ను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top