జూలై 31న 'జయ జానకి నాయక' ఆడియో | Jaya janaki Nayaka Audio Release Date | Sakshi
Sakshi News home page

జూలై 31న 'జయ జానకి నాయక' ఆడియో

Jul 27 2017 4:59 PM | Updated on Sep 5 2017 5:01 PM

జూలై 31న 'జయ జానకి నాయక' ఆడియో

జూలై 31న 'జయ జానకి నాయక' ఆడియో

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'జయ జానకి నాయక'. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

క్లాస్ మాస్ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకొనే విధంగా దేవి తనదైన మార్క్ తో రెడీ చేసిన జయ జానకి నాయక ఆడియోను జూలై 31న ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. 'ఏ విషయంలోనూ రాజీపడకుండా జయ జానకి నాయక చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్, గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి.

ఇటీవల విడుదల చేసిన 'నువ్వేలే నువ్వేలే' పాటకి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. దేవి మళ్ళీ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నాడు. జూలై 31న ఆడియో విడుదల వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం. ఆడియో విడుదల తర్వాత సినిమా మీద ఉన్న క్రేజ్ మరింత పెరుగుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్, పోస్టర్స్ ని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకొంటుండడం చాలా సంతోషంగా ఉంది' అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement