వినోదాల జాతిరత్నాలు | Jathi Ratnalu Movie Motion Poster release | Sakshi
Sakshi News home page

వినోదాల జాతిరత్నాలు

Oct 25 2019 5:45 AM | Updated on Oct 25 2019 5:45 AM

Jathi Ratnalu Movie Motion Poster release - Sakshi

రాహుల్, నవీన్, ప్రియదర్శి

‘మహానటి’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ‘జాతిరత్నాలు’ సినిమాతో నిర్మాతగా మారారు. ‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న తర్వాత స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రమిది. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి హీరోగా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనుదీప్‌ కె.వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రియదర్శి 210, నవీన్‌ పొలిశెట్టి 420, రాహుల్‌ రామకృష్ణ 840 నంబర్లతో ఖైదీల దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు.

‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మంచి క్రేజ్‌ నెలకొంది. ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఫరియా అబ్దుల్లా, మురళీశర్మ, వి.కె.నరేశ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ‘శుభలేఖ’ సుధాకర్, ‘వెన్నెల’ కిషోర్, ‘మిర్చి’ కిరణ్, గిరిబాబు, ‘మహానటి’ ఫేమ్‌ మహేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాత: హర్ష గారపాటి, సంగీతం: రధన్, కెమెరా: సిద్ధాన్‌ మనోహార్‌.

Advertisement
 
Advertisement
Advertisement