మరోసారి హీరోగా జగ్గుభాయ్ | Jagapathi Babu set to comeback as a hero | Sakshi
Sakshi News home page

మరోసారి హీరోగా జగ్గుభాయ్

Sep 21 2016 10:52 AM | Updated on Sep 4 2017 2:24 PM

మరోసారి హీరోగా జగ్గుభాయ్

మరోసారి హీరోగా జగ్గుభాయ్

ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసిన సీనియర్ యాక్టర్ జగపతి బాబు, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో విలన్గా ఫుల్ ఫాంలో ఉన్నాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ చిత్రాల్లో విలన్గా నటిస్తున్నాడు. విలన్గా మారిన....

ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసిన సీనియర్ యాక్టర్ జగపతి బాబు, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో విలన్గా ఫుల్ ఫాంలో ఉన్నాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ చిత్రాల్లో విలన్గా నటిస్తున్నాడు. విలన్గా మారిన తరువాత తిరిగి హీరో పాత్రలకు దూరమైన ఈ సీనియర్ స్టార్ ఇప్పుడు మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ప్రస్తుతం కన్నడలో నిఖిల్ కుమార్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన భారీ చిత్రం జాగ్వర్లో నెగెటివ్ రోల్లో నటిస్తున్న జగ్గుభాయ్, నవంబర్ నుంచి తను హీరోగా తెరకెక్కనున్న సినిమాకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను జాగ్వర్ నిర్మాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్మించనున్నారు. ఇటీవల జరిగిన జాగ్వర్ ఆడియో రిలీజ్ సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు కుమారస్వామి. జగపతిబాబు మంచి నటుడు మాత్రమేకాదు, ఆయన స్టార్ హీరో అన్న నిర్మాత, ఆయన ఏజ్కు బాడీ లాంగ్వేజ్కు తగ్గ కథ దొరికిందని అందుకే వెంటనే సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం జాగ్వర్తో పాటు తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు జగపతిబాబు.

Advertisement
 
Advertisement
Advertisement