జగ్గూభాయ్‌ బయోపిక్‌! | Jagapathi Babu Biopic On Cards | Sakshi
Sakshi News home page

Aug 25 2018 2:09 PM | Updated on Aug 25 2018 2:20 PM

Jagapathi Babu Biopic On Cards - Sakshi

స్టార్‌ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి కెరీర్‌ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న నటుడు జగపతి బాబు. ఇక వెండితెరపై కెరీర్‌ ముగిసినట్టే అనుకుంటున్న సమయంలో విలన్‌ గా టర్న్‌ తీసుకొని మరోసారి ఫుల్‌ఫాంలో దూసుకుపోతున్నారు జగ్గూభాయ్‌. ప్రస్తుతం దక్షిణాది బాషలన్నింటిలో ఫుల్‌ బిజీగా ఉన్న జగపతి బాబు జీవితంతో సినిమా రూపొందించేందుకు కావాల్సినన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. కెరీర్ పరంగా సక్సెస్‌లు ఫెయిల్యూర్స్‌, హీరోయిన్లతో ఎఫైర్స్‌ లాంటివి సినిమాకు కావాల్సినంత మసాలా యాడ్‌ చేస్తాయి.

అందుకే ఆయన కథను బయోపిక్‌ గా రూపొందిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమాగా కాకుండా వెబ్‌ సిరీస్‌ తరహాలో 25 ఎపిసోడ్‌లుగా ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సిరీస్‌ టీవీ చానల్లో ప్రసారం అవుతుందా..? లేక వెబ్‌ సిరీస్‌గా రిలీజ్ చేస్తారా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. జగపతి బాబు కెరీర్‌లో డిఫరెంట్ సినిమాగా పేరు తెచ్చుకున్న ‘సముద్రం’ టైటిల్‌నే ఈ బయోపిక్‌కు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రేజీ బయోపిక్‌ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement