breaking news
samudram Movie
-
అలల కంటే మొండివాడిని.. మరి మీరూ?!
‘ఆర్ఎక్స్ 100’తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల శర్వానంద్, హీరో సిద్దార్థ్‌లతో మల్లీస్టార్ చిత్రం ‘మహాసముద్రం’ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ థీమ్ పోస్టర్‌ను హీరో శర్వానంద్ దీపావళి సందర్భంగా విడుదల చేశాడు. ఎకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యూయేల్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ థీమ్ పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ... ‘సముద్రం అంతా లోతు, అలల కంటే మొండివాడిని.. అంటూ తన సహా నటులైన సిద్దార్థ్‌తో పాటు హీరోయిన్స్ అదితి రావ్, అను ఇమ్మాన్యూమేల్‌లను ట్యాగ్ చేసి మరీ మీరు ఎవరూ అని ప్రశ్నించాడు. అంతేగాక దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలను ట్యాగ్ చేసి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: షేక్ చేస్తున్న శర్వానంద్ ‘భలేగుంది బాలా’ సాంగ్) I'm stubborn than the waves, deep as the seas! @aditiraohydari @Actor_Siddharth @ItsAnuEmmanuel Who are you? #MahaSamudram #ThemePoster 🌊 #HappyDiwali 🪔@DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/MGHfjfaFb8 — Sharwanand (@ImSharwanand) November 14, 2020 కాగా అజయ్ భూపతి మొదటిసారిగా దర్శకత్వం వహించిన రొమాంటిక్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్‌బ్లస్టర్ హిట్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రటి ఆకాశం, సముద్రం బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రిడ్జికి అవతలవైపు ఓ వ్యక్తి పరుగులు తీస్తూ, ఇవతల బ్రిడ్జిపై ఇద్దరూ మనుషులు గన్‌పై నిలుచున్నట్లుగా ఉండి పరుగెడుతున్న వ్యక్తి వైపు గురిపెడుతున్న ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక పొస్టర్‌కు కింద ‘అమితమైన ప్రేమ’ అనే ట్యాగ్ లైన్ ఉండటం చూసి ‘సముద్రం’ రోమాంటిక్, థ్రీల్లర్ నేపథ్యంలో సాగనుందని, దర్శకుడు ఈ సినిమాను ఓరెంజ్‌లో చూపించబోతున్నాడంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక దాదాపు ఏడేళ్ల తర్వాత ‘బొమ్మరిల్లు’ హీరో సిద్దార్థ్ తెలుగు రీఎంట్రీ ఇవ్వడంలో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంటోంది. (చదవండి: టాలీవుడ్లో కొత్త జోడి.. సాయి కాదు అదితి) -
జగ్గూభాయ్ బయోపిక్!
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న నటుడు జగపతి బాబు. ఇక వెండితెరపై కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్న సమయంలో విలన్ గా టర్న్ తీసుకొని మరోసారి ఫుల్‌ఫాంలో దూసుకుపోతున్నారు జగ్గూభాయ్. ప్రస్తుతం దక్షిణాది బాషలన్నింటిలో ఫుల్ బిజీగా ఉన్న జగపతి బాబు జీవితంతో సినిమా రూపొందించేందుకు కావాల్సినన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. కెరీర్ పరంగా సక్సెస్‌లు ఫెయిల్యూర్స్, హీరోయిన్లతో ఎఫైర్స్ లాంటివి సినిమాకు కావాల్సినంత మసాలా యాడ్ చేస్తాయి. అందుకే ఆయన కథను బయోపిక్ గా రూపొందిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ తరహాలో 25 ఎపిసోడ్లుగా ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సిరీస్ టీవీ చానల్లో ప్రసారం అవుతుందా..? లేక వెబ్ సిరీస్‌గా రిలీజ్ చేస్తారా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. జగపతి బాబు కెరీర్లో డిఫరెంట్ సినిమాగా పేరు తెచ్చుకున్న ‘సముద్రం’ టైటిల్‌నే ఈ బయోపిక్కు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రేజీ బయోపిక్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ఆ రాతిరంతా జాతరే...
నిద్రలేని రాత్రులు కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి ఆరోగ్యమే కాదు, మనసూ అల్లకల్లోలమవుతుందని అందరూ అంటారు. అది ఎంతవరకూ నిజమో నాకు తెలీదు. ఎందుకంటే నేను నిద్రలేని రాత్రులు గడిపినా ఏనాడూ నా మనసు గతి తప్పలేదు. నిద్రలేని రాత్రి అనగానే నాకు మొదటగా చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నాను. ఎవరైనా బాగా చదువుతున్నావా అంటే చాలు... సూపర్‌గా చదివేస్తున్నాను, తప్పకుండా మంచి మార్కులతో పాసవుతాను అని గొప్పగా చెప్పేవాడిని. మా ఇంట్లో వాళ్లకే కాదు, ఊరందరికీ కూడా అదే చెప్పాను. నేనిచ్చిన బిల్డప్‌కి అందరూ నేను నిజంగానే మంచి మార్కులతో పాసైపోతాను అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నేను ఫెయిలయ్యాను. రిజల్ట్ చూసుకోగానే గుండె గుభేల్మంది. అందరూ కలిసి ఉతికేస్తారేమోనని భయమేసింది. దాంతో అప్పటికప్పుడు ఓ ప్లాన్ వేశాను. మా ఇంటి ముందున్న మామిడి చెట్టెక్కి కూచున్నాను. గంటో రెండు గంటలో కాదు. రాత్రంతా చెట్టు మీదే ఉన్నాను. మన సంగతి బాగా తెలుసు కాబట్టి... మావాళ్లు ఎక్కడెక్కడో వెతికి, వాడే వస్తాడ్లే అని వదిలేశారు. దాంతో నాకు ఆ రాతిరంతా జాతరే. తెల్లారే వరకూ చెట్టుమీదే జపం చేశాను. తర్వాత ఇక తప్పదని దిగి ఇంటికెళ్లా. పాపం పిల్లాడు రాత్రంతా నిద్ర లేకుండా అవస్థ పడ్డాడే అని మావాళ్లేమీ జాలి పడలేదు నా మీద. ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి, వాళ్ల ఎమోషన్ చల్లార్చుకున్నాకే వదిలారు. ఆ సంఘటన, ఆ రాత్రి చెట్టుమీద నేను పడిన పాట్లు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది నాకు. కెరీర్లో ఎదిగే క్రమంలో ఎవరికైనా పోరాటం ఉంటుంది. దాని కారణంగా కొన్ని నిద్ర లేని రాత్రులూ ఉంటాయి. కానీ వాటిలో బాధ ఉండదు. సంతోషమే ఉంటుంది. అవన్నీ మన బతుకు పుస్తకంలో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే నాకు ఆ సమయంలో గడిపిన రాత్రుల కంటే కృష్ణవంశీతో పని చేసినప్పుడు గడిపిన నిద్రలేని రాత్రులే ఎక్కువ గుర్తు. కృష్ణవంశీతో పని చేయడమంటే మాటలు కాదు. ఆయన సృష్టించే క్యారెక్టర్స్‌ని పండించడం అంత తేలికైన విషయం కాదు. ఆ క్యారెక్టరయి జేషన్ మామూలుగా ఉండదు. వాటిలో లీనమై చేసేసరికి ఒళ్లు హూనమైపోతుంది. ‘సముద్రం’ సినిమాలో నేను చేసింది చాలా క్లిష్టమైన పాత్ర. చాలా డిఫరెంట్ పాత్ర కూడా. అది చేసేటప్పుడు నేను పడిన కష్టం నాకు మాత్రమే తెలుసు. నిద్రపట్టేది కాదు. ఇరవై నాలుగ్గంటలూ ఆ పాత్ర మీదే ధ్యాస. ఎలా చేయాలి, ఎంత బాగా పండించాలి అన్నదే ఆలోచన. షూటింగ్ పూర్తయ్యాక మాత్రం ఆదమరిచి నిద్రపోయాను. అలసిపోయినందుకు కాదు. అంత గొప్ప పాత్ర చేశానే అన్న తృప్తితో. కృష్ణవంశీతో ఎప్పుడు పని చేసినా ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇక వ్యక్తిగత జీవితంలో అయితే... నేను స్వతహాగా అనవసర విషయాల జోలికి వెళ్లను. నా పనేంటో నేను చేసుకు పోతాను తప్ప, ఏవీ పట్టించుకోను. కానీ మొదటిసారి పట్టించుకున్నాను. అవే మొన్న జరిగిన ‘మా’ ఎలక్షన్స్. ఎంత పెద్ద విషయానికైనా చలించని నన్ను ఈ ఎన్నికలు చాలా కలవరపెట్టాయి. చాలా డిస్టర్బ్ చేశాయి. ఎందుకు ఇలాంటి మనుషుల మధ్యకి వచ్చానా, ఎందుకు ఇలాంటి వాళ్లతో పోటీకి నిలబడ్డానా అని నాలో నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఎప్పుడూ నన్ను ఏ విషయంలోనూ ఏమీ అనని, అడ్డుకోని మా ఇంట్లో వాళ్లు కూడా... ‘మీకు అవసరమా ఇవన్నీ’ అన్నారంటే నేనెంతగా మథనపడ్డానో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ఎలక్షన్లు చూశాను కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే పోటీ బాధపెట్టినా, ఫలితాలు సంతోషాన్నే మిగిల్చాయి. ఇక మిగతా సమస్యలంటారా? అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా పక్కవాళ్ల సమస్యల్ని మన సమస్యల్లా ఫీలైపోయి, వాటిని మీద వేసుకుని, ఎలా పరిష్కరించాలా అని మల్లగుల్లాలు పడిపోయే నాలాంటి వాళ్లకు నిద్రలేని రాత్రులు లేకుండా ఉంటాయా! ఆలోచనలతో కొన్ని... ఆవేదనతో కొన్ని... ఎదురు దెబ్బలు తిన్న బాధతో కొన్ని... ఇలా కొన్ని కొన్ని కలిసి ఎన్నో ఉంటాయి. కానీ వాటి గురించి ఎప్పుడూ బాధపడను. ఎందుకంటే మరొకరి బాధను పంచుకోవడంలో ఆనందం ఉంటుంది. ఆ సంతోషం ముందు నాకు మరేదీ ఎక్కువ కాదనిపిస్తుంది. అందుకే ఒకరి కోసం నిద్ర లేకుండా గడిపిన ఏ రాత్రీ నన్ను బాధపెట్టదు. బాధను మిగల్చదు. - సమీర నేలపూడి