జాకీచాన్ చిత్రాన్ని సూపర్‌స్టార్ చూస్తారా? | Jackie Chan movie watch Rajinikanth ? | Sakshi
Sakshi News home page

జాకీచాన్ చిత్రాన్ని సూపర్‌స్టార్ చూస్తారా?

Aug 31 2016 1:41 AM | Updated on Sep 4 2017 11:35 AM

జాకీచాన్ చిత్రాన్ని సూపర్‌స్టార్ చూస్తారా?

జాకీచాన్ చిత్రాన్ని సూపర్‌స్టార్ చూస్తారా?

జాకీచాన్ ఈ పేరు వింటేనే అబ్బురపరచే యాక్షన్ చిత్రాలు గుర్తుకొస్తాయి. బ్రహ్మాండ చిత్రాలకు మారుపేరు జాకీచాన్ అనవచ్చు.

 జాకీచాన్ ఈ పేరు వింటేనే అబ్బురపరచే యాక్షన్ చిత్రాలు గుర్తుకొస్తాయి. బ్రహ్మాండ చిత్రాలకు మారుపేరు జాకీచాన్ అనవచ్చు. ఆయన నటించిన అనేక చిత్రాలు భారతీయ సినీ ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేశాయి. జాకీచాన్ చిత్రాల కోసం ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారనడం అతిశయోక్తి కాదు. ప్రపంచ హీరో నటించిన తాజా చిత్రం స్కిప్ ట్రాస్. ఈ చిత్రం ఈ మధ్యనే చైనాలో విడుదలై ఒక్క రోజులోనే 420 కోట్లు వసూలు చేసిందని, వారానికే వెయ్యికోట్లు కలెక్ట్ చేసిందని ఈ చిత్రాన్ని తమిళంలోకి ఇరు కిల్లాడిగళ్ పేరుతో అనువదించి విడుదల చేస్తున్న సన్‌మూన్ పిక్చర్స్ విశ్వాస్ సుందర్ తెలిపారు.
 
  విశేషం ఏమిటంటే మన సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి విడుదలైన రోజునే స్కిప్ ట్రాస్ చిత్రం చైనాలో విడుదలైంది. కబాలి చిత్రాన్ని విడుదలైన రోజునే జాకీచాన్ చూసి బ్రహ్మాండం అని అభినందించారట. కాగా ఇరు కిల్లాడిగళ్ పేరుతో సెప్టెంబర్ రెండో తేదీన విడుదల కానున్న స్కిప్ ట్రాస్ చిత్రాన్ని రజనీకాంత్ చూస్తారా? అన్న ఆసక్తిని జాకీచాన్ వర్గం వ్యక్తం చేస్తోందట. ఇది పక్కా కమర్షియల్ కథా చిత్రం అని నిర్మాత విశ్వాస్‌సుందర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement