
శిరీష, అమీర్, అశ్విత
ఓ యువ రైతు తన గ్రామంలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతుంటాడు. ఓ అమ్మాయిని ప్రేమించి, పెళ్లాడి జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఇంతలో అతను హత్య కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇట్లు’. అమీర్ హీరోగా, శిరీష, అశ్విత హీరోయిన్లుగా రోశిరెడ్డి పందిళ్ళపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రాజగౌడ్ పుదారీ, మెట్టయ్య వుప్పల, డా. రఘు, డా. శ్రీరాములు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ముహూర్తపు షాట్‌కి వాణి (ఎంఎఫ్‌టిఐ) కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు నారాయణరావు క్లాప్ ఇచ్చారు. మద్దూరి వెంకట కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. రోశిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకున్నాను. రెండు, మూడు లఘు చిత్రాలను రూపొందించి, ‘ఇట్లు’ సినిమాతో దర్శకుడిగా మారుతున్నా. యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్, కామెడీ అంశాలు ఉంటాయి’’ అన్నారు. ‘‘రోశిరెడ్డి గత 12 ఏళ్లు్లగా తెలుసు. ‘ఇట్లు’ కథ నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు రాజగౌడ్.