రొమాంటిక్‌ లవ్‌స్టోరీ

ishtanga movie press meet - Sakshi

అర్జున్‌ మహి, తనిష్క్‌ రాజన్‌ జంటగా ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ఇష్టంగా’. సంపత్‌ .వి రుద్ర దర్శకత్వంలో ఎ.వి.ఆర్‌ మూవీ వండర్స్‌ పతాకంపై అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా ఈనెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంపత్‌ వి.రుద్ర మాట్లాడుతూ– ‘‘ఇది నా తొలి చిత్రం. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. కథకి తగ్గట్టే మంచి విజువల్స్‌ ఉన్నాయి. గోవాలో 10రోజుల పాటు చిత్రీకరించాం. బడ్జెట్‌ విషయంలో నిర్మాత రాజీ పడకుండా కావాల్సినవి సమకూర్చారు.

సినిమా మంచి హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కొత్తవారిని ప్రోత్సహిస్తే మంచి సినిమాలు వస్తాయి. మా సినిమాని భారీగా రిలీజ్‌ చేస్తున్నాం. నాకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు వెంకటేశ్వరరావు. ‘‘ఒక వెబ్‌సైట్‌లో పని చేసే కంటెంట్‌ రైటర్‌ బాధ్యతలేని కుర్రాడి ప్రేమలో పడుతుంది. అయినా తమ ప్రేమ స్వచ్ఛమైనదని కథానాయిక పాత్ర నిరూపిస్తుంది. ఇందులో వినోదంతో పాటు సందేశం ఆకట్టుకుంటుంది’’ అని అర్జున్‌ మహి అన్నారు. తనిష్క్, నటుడు దువ్వాసి మోహన్, కెమెరామెన్‌ ఆనంద్‌ నడకట్ల, సంగీత దర్శకుడు యేలేంద్ర మహావీర్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top