కాపురంలో కలతలా? | Is Vidya Balan Having A Rift With Hubby Siddharth? | Sakshi
Sakshi News home page

కాపురంలో కలతలా?

May 6 2014 10:58 PM | Updated on Sep 2 2017 7:00 AM

కాపురంలో కలతలా?

కాపురంలో కలతలా?

సంసారం అనే నావ సాఫీగా సాగినంతవరకే వైవాహిక జీవితం పసందుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చాయా..

 సంసారం అనే నావ సాఫీగా సాగినంతవరకే వైవాహిక జీవితం పసందుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చాయా.. ఇక అంతే సంగతులు. ఆ సంసారం ఛిన్నాభిన్నం అయిపోతుంది. సిద్ధార్ధ్‌రాయ్‌కపూర్, విద్యాబాలన్‌ల సంసారం అంతవరకూ రాలేదు కానీ.. ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు నెలకొన్నాయని బాలీవుడ్ టాక్. ఈ మధ్య విద్యాబాలన్ విదేశాలకు వెళ్లినప్పుడు ఆమె భర్త వేరే నటితో స్నేహం మొదలుపెట్టారనే వార్త హల్‌చల్ చేస్తోంది. కేవలం స్నేహం మాత్రమే అన్న చందంగా ఈ వ్యవహారం లేకపోవడంతో విద్య కలత చెందారట. ఈ కారణంగానే తన విదేశీ కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుంటున్నారని సమాచారం.
 
  సిద్ధార్ధ్‌రాయ్‌కి ఇది మూడో పెళ్లి. ఇద్దరు భార్యలకు దూరమైన సిద్ధార్ధ్‌రాయ్ తన విషయంలో అలా చేయకుండా ఉంటాడా? అనే భయం విద్యను వెంటాడుతుందట. విద్య, సిద్ధార్ధ్‌రాయ్ పెళ్లయ్యి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. పెళ్లయిన తర్వాత పలు సందర్భాల్లో అత్తవారిల్లు తనకు పుట్టిల్లులాంటిదని, వైవాహిక జీవితం చాలా బాగుందని చెప్పారు విద్య. ఒకవేళ సిద్ధార్ధ్‌రాయ్ కనుక ఆమెను నిర్లక్ష్యం చేస్తే... పరిస్థితిని చక్కదిద్దుకోగల నేర్పు విద్యాకి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ మధ్య విద్యా ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఆమె భర్తతనని నిర్లక్ష్యం చేస్తాడు. చివరకు తప్పు తెలుసుకుంటాడు. మరి... సిద్ధార్ధ్‌రాయ్ కనుక విద్యని అలానే చేస్తే, ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’లా వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు పడాలని కోరుకోనివారు ఉండరు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement