అదృష్టాన్ని ఎవరూ అడ్డుకోలేరంటారు. ఏది ఎవరికి దక్కాలనుకుంటే వారికే దక్కుతుంది. ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే నటి శృతి హాసన్ విషయంలో

అదృష్టాన్ని ఎవరూ అడ్డుకోలేరంటారు. ఏది ఎవరికి దక్కాలనుకుంటే వారికే దక్కుతుంది. ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే నటి శృతి హాసన్ విషయంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఈ బ్యూటీ తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. తమిళంలో హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్న శృతికి త్వరలోనే అది నెరవేరే సమయం వచ్చే అవకాశం ఉంది. ఈ ముద్దుగుమ్మకు మరో బాలీవుడ్ అవకాశం వచ్చింది.
తమిళంలో విజయకాంత్ నటించిన రమణ చిత్రం హిందీలో రీమేక్ కానుంది. గబ్బర్ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం లో అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. వానం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దీనికి దర్శకుడు. హీరోయిన్‌గా సిమ్రాన్ పాత్రకు దక్షిణాది ఛాయలున్న హీరోయిన్ కోసం అన్వేషించారు. చివరికి శృతిహాసన్‌ను ఎంపిక చేసి ఫొటో సెషన్ కూడా చేశారు. అయితే శృతిలో దక్షిణాది అమ్మాయి ఛాయలు కనిపించకపోవడంతో ఆ పాత్రకు నటి అమలాపాల్‌ను ఎంపిక చేయాలనుకున్నారు. ఆమెతోను ఫొటో షూట్ చేశారు.
దీంతో బాలీవుడ్‌లో ఒక రౌండ్ కొట్టేయవచ్చని ఈ కేరళ కుట్టి తెగ ఉత్సాహపడిపోయింది. అయితే మళ్లీ గబ్బర్ చిత్ర దర్శక నిర్మాతలు శృతిహాసన్‌నే ఎంపిక చేశారు. ఆ పాత్రకు ఆమె బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. శృతికి బాలీవుడ్‌లో ఉన్న పాపులారిటీనే వారి నిర్ణయానికి కారణం అని సమాచారం. ప్రస్తుతం శృతి హిందీలో వెల్‌కంబ్యాక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో రామ్‌చరణ్ సరసన నటించిన ఎవడు సంక్రాంతి కానుకగాను అల్లుఅర్జున్‌కు జంటగా నటించిన రేస్ గుర్రం ఫిబ్రవరిలోను విడుదలకు సిద్ధం అవుతున్నాయి.