ఇంకేంటి నువ్వే చెప్పు! | Inkenti Nuvve Cheppu Audio Launch | Sakshi
Sakshi News home page

ఇంకేంటి నువ్వే చెప్పు!

Dec 11 2016 11:11 PM | Updated on Sep 4 2017 10:28 PM

ఇంకేంటి నువ్వే చెప్పు!

ఇంకేంటి నువ్వే చెప్పు!

మంచి చిత్రాలను నిర్మించే సంస్థగా మాకున్న పేరు, విలువ ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది.

 ‘‘మంచి చిత్రాలను నిర్మించే సంస్థగా మాకున్న పేరు, విలువ ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రమిది’’ అన్నారు నిర్మాత మళ్ల విజయప్రసాద్. ప్రశాంత్, సన్ని, అక్ఛిత, ప్రసన్నలను హీరో హీరోయిన్లుగా, శివశ్రీ దర్శకత్వంలో వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘ఇంకేంటి నువ్వే చెప్పు’. వికాస్ సంగీతమందించిన పాటలను విశాఖ ఆర్కే బీచ్‌లో విడుదల చేశారు. ‘‘అందరూ కొత్తవాళ్లతో తీసిన ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత . వెల్ఫేర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మళ్ల అరుణకుమారి, నటుడు సుమన్, సహ నిర్మాత విద్యార్థి వెంకట్రావ్ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement