ఇనియాతో చిందేస్తే సరిపోతుంది | Iniya to act with vishal | Sakshi
Sakshi News home page

ఇనియాతో చిందేస్తే సరిపోతుంది

Mar 4 2014 11:45 PM | Updated on Sep 2 2017 4:21 AM

ఇనియాతో చిందేస్తే సరిపోతుంది

ఇనియాతో చిందేస్తే సరిపోతుంది

నటి ఇనియాతో కలిసి విశాల్ చిందేస్తే చిత్రం పూర్తి అవుతుందంటున్నారు దర్శకుడు తిరు. ఇంతకుముందు విశాల్ హీరోగా తీరాద విళైయాట్టు పిళ్లై సమర్ చిత్రాలను తెరకెక్కించిన ఈ యువ దర్శకుడు ముచ్చటగా మూడో సారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం నాన్ సిగప్పు మనిదన్.

 నటి ఇనియాతో కలిసి విశాల్ చిందేస్తే చిత్రం పూర్తి అవుతుందంటున్నారు దర్శకుడు తిరు. ఇంతకుముందు విశాల్ హీరోగా తీరాద విళైయాట్టు పిళ్లై సమర్ చిత్రాలను తెరకెక్కించిన ఈ యువ దర్శకుడు ముచ్చటగా మూడో సారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం నాన్ సిగప్పు మనిదన్. విశాల్, యూటీవీ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా లక్ష్మీ మీనన్ నటిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు పాండియనాడు వంటి హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నాన్ సిగప్పు మనిధన్ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.
 
 చిత్రం గురించి దర్శకుడు తిరు మాట్లాడుతూ ఒక పాట, ఫైట్ సీక్వెన్స్ మినహా చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు తెలిపారు. విశాల్, ఇనియా, సుందర్, జగన్ పాల్గొననున్న ఈ పాటను త్వరలో మాధవరంలో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు తీరాద విళైయాట్టు పిళ్లై, సమర్ చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించామన్నారు. అయితే నాన్‌సిగప్పు మనిదన్ చిత్ర షూటింగ్‌ను పూర్తిగా చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. అయితే రెండు పాటలు మాత్రం రాజస్థాన్, కులుమనాలి ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించడం గమనార్హం. ఈ చిత్రాన్ని తెలుగులో ఇంద్రుడు పేరుతో విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. చిత్రంలో విశాల్ పేరు ఇంద్రన్ అని అందుకే తెలుగులో ఇంద్రుడు పేరు కరెక్ట్‌గా ఉంటుందని ఆ పేరు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement