విశాల్ ఇంద్రుడు | Indrudu is Vishal's new movie title | Sakshi
Sakshi News home page

విశాల్ ఇంద్రుడు

Mar 6 2014 12:41 AM | Updated on Sep 2 2017 4:23 AM

విశాల్ ఇంద్రుడు

విశాల్ ఇంద్రుడు

తెలుగు, తమిళ భాషల్లో మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ఇటీవల విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ అనే బేనర్‌ని ఆరంభించిన విషయం తెలిసిందే.

తెలుగు, తమిళ భాషల్లో మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ఇటీవల విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ అనే బేనర్‌ని ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థపై తొలి ప్రయత్నంగా విశాల్ నిర్మించిన ‘పాండియనాడు’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగులో ‘పల్నాడు’గా విడుదలైంది. ప్రస్తుతం విశాల్ ‘ఇంద్రుడు’ అనే చిత్రంలో హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్నారు. సిద్ధార్ధ్ రాయ్ కపూర్ ఓ నిర్మాత. విశాల్ సరసన ‘పల్నాడు’లో నటించిన లక్ష్మీమీనన్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. తిరు దర్శకుడు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. త్వరలో థాయ్‌ల్యాండ్‌లో ఈ పాటలను చిత్రీకరించనున్నారు. పూర్తయినంతవరకు రషెస్ చూసిన బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఈ చిత్రం హిందీ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీవీ ప్రకాష్‌కుమార్ పాటలు స్వరపరచిన ఈ సినిమాకి రిచర్డ్ ఎన్ నాథన్ ఛాయాగ్రాహకుడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement