టాటులే వారిని మాట్లాడించాయి | Imran, Kangana bonded over tattoos | Sakshi
Sakshi News home page

టాటులే వారిని మాట్లాడించాయి

Aug 12 2015 4:31 PM | Updated on Apr 3 2019 6:23 PM

టాటులే వారిని మాట్లాడించాయి - Sakshi

టాటులే వారిని మాట్లాడించాయి

ప్రముఖ బాలీవుడ్ నటులు ఇమ్రాన్ ఖాన్, కంగనా రనౌత్ ప్రారంభంలో పెద్దగా మాట్లాడుకోకపోయినా వారు వేసుకున్న టాటూలు మాత్రం మాట్లాడించేవట.

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటులు ఇమ్రాన్ ఖాన్, కంగనా రనౌత్ ప్రారంభంలో పెద్దగా మాట్లాడుకోకపోయినా వారు వేసుకున్న టాటూలు మాత్రం మాట్లాడించేవట. వారిద్దరు నటీ నటులుగా 'కట్టి బట్టి' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్ర షూటింగ్కు ఎవరి బిజీలో వారొచ్చినప్పటికీ ఒకరికొకరు ఎదురుపడగానే ఒక్కసారిగా ఆగిపోయి ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ అవాక్కయ్యేవారట.

ఆ వెంటనే తేరుకుని వారి ఒంటిపై ఉన్న టాటూల గురించి నాన్ స్టాప్గా మాట్లాడుకునే వారంట. కంగనా మాత్రం తన టాటూలను(బిజ్లీ టాటూతో సహా) ఎలాంటి మొహమాటం లేకుండా చూపిస్తుంటే ఇమ్రాన్ మాత్రం తన టాటూలను కొంచెం సిగ్గుతో దాచుకునేందుకు ప్రయత్నించేవాడట. ఇక వీరిద్దరికి టాటూలు వేసేందుకు మేకప్ బాయ్కు చెరొక గంట సమయం పట్టేదంట. ఇంతకీ ఈ టాటూలు ఎందుకనుకుంటున్నారు? కట్టి బట్టి సినిమా కోసమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement