నేను భయాన్ని క్యాష్‌ చేసుకుంటా | I'm B-grade fear seller: Vikram Bhatt | Sakshi
Sakshi News home page

నేను భయాన్ని క్యాష్‌ చేసుకుంటా

Jan 7 2018 7:53 PM | Updated on Jan 7 2018 8:17 PM

I'm B-grade fear seller: Vikram Bhatt - Sakshi

సాక్షి, ముంబయి : స్నేహం, లవ్‌.. ఇలా డబ్బుతో అన్నీ అమ్ముడవుతున్న రోజుల్లో తాను భయాన్ని అమ్ముతున్నానని ఫిల్మ్‌ మేకర్‌ విక్రమ్‌ భట్‌ చెప్పుకొచ్చారు. ‘ప్రేమ, స్నేహం, హాస్యం, ఆశ, చివరికి కన్నీళ్లు సైతం డబ్బుతో తయారవుతున్న నేటి ప్రపంచంలో నేను భయాన్ని అమ్ముతున్నా’  అంటూ విక్రమ్‌ భట్‌ తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో రాసుకొచ్చారు.

భట్‌ తన తదుపరి హారర్‌ ఫిల్మ్‌ ‘1921’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. లండన్‌లో చిత్రీకరించిన ఈ మూవీ ప్రధాన తారాగణం జరీన్‌ ఖాన్‌, కరణ్‌ కుంద్రాల చుట్టూ తిరుగుతుంది. చావు బతుకుల మధ్య ఓ జంట పడే స్ట్రగుల్‌ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement