
చట్టంలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో పాటు సెక్షన్స్‌ను డీప్‌గా సెర్చ్ చేస్తున్నారు కింగ్ రాణా రతన్ సింగ్. అరే... సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. రాజుల కాలంలో కోర్టులు, చట్టాలు ఏంటీ? రాజ దర్బారులు, ఆజ్ఞలు, శిక్షలు ఉంటాయి కదా అనుకుంటున్నారా! అసలు విషయం ఏంటంటే.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘పద్మావతి’ చిత్రంలో కింగ్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటించారు.
ఆ సిన్మా షూటింగ్, విడుదల వివాదాల గురించి పక్కన పెడితే... నెక్ట్స్ షాహిద్ కపూర్ ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ’ చిత్రంతో బీటౌన్‌లో దర్శకునిగా పరిచయం అయిన శ్రీ నారాయణ్‌సింగ్ రూపొందిస్తున్న ‘బట్టీ గుల్ మీటర్ ఛలా’లో ఇలియానాను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారన్నది బాలీవుడ్ లేటెస్ట్ కబర్. ఈ సినిమాలో షాహిద్ లాయర్‌గా కనిపించనున్నారు.
‘పద్మావతి’కోసం రతన్ సింగ్ రాజుగా మౌల్డ్ అయినా షాహిద్ ఇప్పుడు లాయర్‌గా మారుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను జనవరి 19న స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ‘‘సామాన్యునికి ఎలక్ట్రిసిటీ పవర్ అందాల్సిన అవసరం, వారు ఎదుర్కొనే కష్టాలు, పవర్ బిల్స్ వంటి అంశాలతో సినిమాను తెరకెక్కించనున్నాం’’ అని పేర్కొన్నారు నారాయణ్. ఈ సినిమాను ఆగస్టు 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.