ఓ ట్రాన్స్‌లో ఉన్నా! - హీరో శర్వానంద్ | iam in trance sharvanand | Sakshi
Sakshi News home page

ఓ ట్రాన్స్‌లో ఉన్నా! - హీరో శర్వానంద్

Jan 19 2016 11:21 PM | Updated on Sep 3 2017 3:55 PM

ఓ ట్రాన్స్‌లో ఉన్నా! - హీరో శర్వానంద్

ఓ ట్రాన్స్‌లో ఉన్నా! - హీరో శర్వానంద్

‘‘సినిమా సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. అందరూ హిట్ అంటుంటే ఓ ట్రాన్స్‌లో ఉన్నా..........

 ‘‘సినిమా సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. అందరూ హిట్ అంటుంటే ఓ ట్రాన్స్‌లో ఉన్నా. కలెక్షన్స్ చూశాక నిజంగా హిట్ సాధించామని గర్వంగా చెబుతున్నా’’ అని హీరో శర్వానంద్ అన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్, సురభి జంటగా యువి క్రియే షన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఈ నెల 14న రిలీజైంది. ఈ చిత్రానికి స్పందన వస్తుండ డంతో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. మేర్లపాక గాంధీ, ప్రమోద్, విక్కీ, రవీందర్, బ్రహ్మాజీ, నాగి నీడు, ధన్‌రాజ్, రఘు మాస్టర్, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, జె.బి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement