నేను కూడా ఆగలేకపోతున్నా: రాజమౌళి | I myself cant wait to tweet the first look, says ss rajamouli | Sakshi
Sakshi News home page

నేను కూడా ఆగలేకపోతున్నా: రాజమౌళి

Oct 22 2016 5:07 PM | Updated on Sep 4 2017 6:00 PM

నేను కూడా ఆగలేకపోతున్నా: రాజమౌళి

నేను కూడా ఆగలేకపోతున్నా: రాజమౌళి

బాహుబలి -2 ఫస్ట్‌లుక్ విడుదల చేయడానికి తాను కూడా ఆగలేకపోతున్నానని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్‌లో తెలిపారు.

బాహుబలి -2 ఫస్ట్‌లుక్ విడుదల చేయడానికి తాను కూడా ఆగలేకపోతున్నానని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్‌లో తెలిపారు. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయని, అవి క్లియర్ అయిపోగానే మీ అందరి కోసం అతి త్వరలోనే అది వచ్చేస్తుందని చెప్పారు. ఎవరూ అడ్డుకోలేని తన శక్తితో మాహిష్మతి రాజ్యాన్ని ఎలా గెలుచుకుంటాడో అన్నదే బాహుబలి-2 ద కన్‌క్లూజన్ కథ అని వివరించారు. 
 
వాస్తవానికి బాహుబలి-2 ఫస్ట్‌లుక్‌ను సాయంత్రం 4.45 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అనుకున్నదాని కంటే కార్యక్రమం కొంత ఆలస్యమైంది. బాహుబలి సినిమా సెట్స్‌లో చాలా గ్రాండ్‌గా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, హీరోయిన్లు అనుష్క, తమన్నాలతో పాటు నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ తన కుటుంబంతో సహా వచ్చారు. పలువురు సాంకేతిక సిబ్బంది సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
 
Advertisement
Advertisement