‘ఐ’ అదిరింది | ‘I ’movie beautiful | Sakshi
Sakshi News home page

‘ఐ’ అదిరింది

Mar 30 2014 12:38 AM | Updated on Sep 2 2017 5:20 AM

‘ఐ’ అదిరింది

‘ఐ’ అదిరింది

‘ఐ’ అదిరింది అని అంటుందెవరో కాదు ఆ చిత్ర నిర్మాత, ఆస్కార్ రవిచంద్రన్. చిత్రాన్ని వెండితెరపై చూసి ప్రేక్షకులు ఇదే మాట అంటారని స్పష్టం చేస్తున్నారాయన.

‘ఐ’ అదిరింది అని అంటుందెవరో కాదు ఆ చిత్ర నిర్మాత, ఆస్కార్ రవిచంద్రన్.  చిత్రాన్ని వెండితెరపై చూసి ప్రేక్షకులు ఇదే మాట అంటారని స్పష్టం చేస్తున్నారాయన. స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో అద్భుత చిత్రం ‘ఐ’. విలక్షణ నటుడు విక్రమ్, అందాల భామ ఎమిజాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇది. బ్రహ్మాండం అంటే శంకర్ చిత్రాల్లోనే చూడాలనడం అతిశయోక్తి కాదు.
 
  ఆయన గత చిత్రాలను చూసిన వారెవరైనా ఇదే మాట అంటారు. అదే కోవలో అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఐ’. ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్‌ను నిర్మాత తన సొంత స్టూడియోలో ఇటీవల వేసుకుని చూశారట.
 
 అనంతరం ఆయన అన్న మాటనే ‘ఐ’ అదిరింది అని, ఇంతకుముందు శంకర్ విక్రమ్‌ను అన్నియన్ చిత్రంలో మూడు కోణాల్లో చూపించి ఆహా అనిపించారు. ఈ ‘ఐ’ చిత్రంలో విక్రమ్‌ను ఆరు గెటప్‌లలో చూపించి అబ్బుర పరిచారని నిర్మాత పేర్కొన్నారు. ఇందులో విక్ర మ్ కళాశాల యువకుడిగా, బాడీ బిల్డర్‌గా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారని చెప్పారు. ఈ పాత్రల పోషణ కోసం విక్రమ్ చూపిన అంకితభావం మాటల్లో చెప్పలేనన్నారు. పాత్ర స్వభావాన్ని బట్టి నటుల నుంచి అభినయాన్ని రాబట్టడంలోను, వారి పాత్ర రూపకల్పన లోను శంకర్ అత్యంత శ్రద్ధ చూపిస్తారన్నారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో ‘ఐ’ చిత్రం ఉంటుందని ఆస్కార్ రవిచంద్రన్ అన్నారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement