అనుపమకు ఎలాంటి అబ్బాయంటే ఇష్ట‌మంటే.. | I like a man who looks like a bad boy says Anupama Parameswaran | Sakshi
Sakshi News home page

అనుపమకు ఎలాంటి అబ్బాయంటే ఇష్ట‌మంటే..

Dec 15 2018 8:07 PM | Updated on Dec 15 2018 8:28 PM

I like a man who looks like a bad boy says Anupama Parameswaran - Sakshi

చూడడానికి బ్యాడ్‌ బోయ్‌లా ఉన్నా ఇబ్బంది లేదు

ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అందాల భామ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనుపమ నటిగా బిజీగా ఉంటూనే ఒక్కసారిగా తనకు ఎలాంటి అబ్బాయంటే ఇష్టమో చెప్పడం ప్రారంభించారు. తాను సిగ్గుపడుతున్నట్టు ఉన్న ఓ ఫోటోతో పాటూ తాను ఇష్టపడే అబ్బాయికి కావాల్సిన క్వాలిటీలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. చూడడానికి బ్యాడ్‌ బోయ్‌లా ఉన్నా సరే.. మహిళలను రాణిలా చూసుకునే అబ్బాయంటే ఇష్టమని అనుమప తెలిపారు. 

నేను బ్యాడ్‌కి డ్యాడ్‌లాంటి వాన్ని, కానీ అమ్మాయిలను రాణిలా చూసుకుంటానని ఓ యువకుడు మెసేజ్‌ పెడితే.. అయితే నువ్వు వెతికేది నాలాంటివాడికోసమే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా దర్శకుడు పవన్ వడయార్ తెరకెక్కిస్తున్న 'నట సార్వభౌమ' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగులో చివరగా ఎన్టర్జిక్ స్టార్ రామ్ పోతినేని సరసన హలో గురూ ప్రేమ కోసమే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement