'ఆయనతో నటించటం నా అదృష్టం' | i am fortunate working with amithab : nawazuddhin siddiqui | Sakshi
Sakshi News home page

'ఆయనతో నటించటం నా అదృష్టం'

Oct 7 2015 10:34 AM | Updated on May 28 2018 4:05 PM

'ఆయనతో నటించటం నా అదృష్టం' - Sakshi

'ఆయనతో నటించటం నా అదృష్టం'

బాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న నవాజుద్దీన్ సిద్ధికీ, అమితాబ్ బచ్చన్తో కలిసి నటించే అవకాశంపై స్పందించాడు. అంతటి లెజెండరీ యాక్టర్తో కలిసి నటించటం నా అదృష్టం...

బాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న నవాజుద్దీన్ సిద్ధికీ.. అమితాబ్ బచ్చన్తో కలిసి నటించే అవకాశంపై స్పందించారు. అంతటి లెజెండరీ యాక్టర్తో కలిసి నటించటం తన అదృష్టం అన్నారు. సుజయ్ ఘోష్ కథతో విభుపూరి డైరెక్ట్ చేస్తున్న 'కేరళ' సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, అమితాబ్ బచ్చన్లు కలిసి నటిస్తున్నారు.

'ఎప్పటి నుంచో అమితాబ్ తో కలిసి నటించాలన్నది నా కల. నా తర్వాతి సినిమాలోనే ఆయనతో కలిసి నటించబోతున్నాను. ఇది నిజంగా నా అదృష్టం' అని తన అభిమానాన్ని చాటుకున్నారు. అమితాబ్ స్వయంగా తన సినిమాలో నవాజ్కు ఓ క్యారెక్టర్ ఇవ్వమని కోరటంతో మరింత ఆనందంలో ఉన్నారు ఈ విలక్షణ నటుడు.

ఇప్పటికే ఈ ఏడాది 'భజరంగీ బాయ్జాన్', 'మాంఝీ' లాంటి సినిమాల్లో నటించిన నవాజుద్దీన్ ప్రస్తుతం షారుఖ్తో కలిసి 'రాయిస్' సినిమాలో నటిస్తున్నారు. అమితాబ్, నవాజ్ల కాంబినేషన్ లో రూపొందనున్న 'కేరళ' వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement