కాలాకు ముందే టచ్‌లో ఉన్నాం

Huma Qureshi Reveal About Her approaching In Kaala  - Sakshi

తమిళసినిమా: కాలా చిత్ర ప్రారంభానికి ముందే తామిద్దరం టచ్‌లో ఉన్నాం అని చెప్పింది నటి హ్యూమఖురేషీ. ఈ సుందరి కోలీవుడ్‌ ఎంట్రీనే సంచలన చిత్రంతో కావడం అదృష్టమే. రజనీకాంత్‌తో ఒక్క సన్నివేశంలో నటించినా చాలని ఎందరో కోలీవుడ్‌ ప్రముఖ నటీమణులు ఆశ పడుతుంటే అలాంటి అవకాశాన్ని హ్యూమఖురేషీని చాలా సులభంగా వరించిందనే చెప్పాలి. కాలా చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ప్రేయసిగా నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకుని ఆ పాత్రతో మంచి గుర్తింపు పొందిన బాలీవుడ్‌ బ్యూటీ హ్యూమఖురేషీ. ఇంతకీ కాలా చిత్రానికి ముందు మేము టచ్‌లో ఉన్నాం అని ఈ అమ్మడు ఎవరి గురించి అంటుందనేగా మీ ఉత్సుకత. ఆ కథేంటో ఈ జాణ మాటల్లోనే చూద్దాం. నేను నటించిన హిందీ చిత్రం గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసీపూర్‌ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్‌ చూశారట.

అందులో నా నటన ఆయనకు బాగా నచ్చేసింది. ఆయన నా గురించి చాలా మందికి చెప్పారట. అయితే నాకు నటుడు ధనుష్‌ నుంచే ఫోన్‌కాల్‌ వచ్చింది. నేను ధనుష్‌ చాలా కాలంగానే టచ్‌లో ఉన్నాం. ఆయన ప్రతిభావంతుడైన నటుడు. ఇద్దరం కలిసి చిత్రం చేయాలనుకున్నాం. ఒక చిత్రంలో నటించాలనుకున్నా, పలు కారణాల వల్ల అది జరగలేదు. అలాంటిది ఒక సారి ధనుష్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అది చిత్రం గురించి మాట్లాడడానికేనని భావించాను. అయితే నేను నిర్మించనున్న చిత్రంలో నటించాలి. హీరో రజనీకాంత్‌ అని ఆయన చెప్పగానే నేను వింటోంది నిజమేనా అన్న సందేహం కూడా కలిగింది. ధనుష్‌ నిజమేనని నిర్ధారణ చేయడంతో ఆనందంతో ఎగిరి గంతేశాను. ఆ తరువాత దర్శకుడు పా.రంజిత్‌ను కలిశాను. ఆయన చెప్పిన కథ బాగా నచ్చేసింది. కాలా చిత్రంలో నటించాలని వెంటనే నిర్ణయించుకున్నాను. ఈ చిత్రంలో కష్టమైన విషయం ఏమిటంటే నేను రజనీకాంత్‌ను తిట్టడమే. ఆ సన్నివేశంలో నటించడానికి చాలా కష్టపడ్డాను. అయితే ఆ సన్నివేశానికి మంచి పేరు వచ్చింది. రజనీకాంత్‌తో నటించడం మధురమైన అనుభవం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top