కోలీవుడ్లో సత్తా చాటిన మహేష్..! | Huge demand for Spyders Tamil rights | Sakshi
Sakshi News home page

కోలీవుడ్లో సత్తా చాటిన మహేష్..!

Jul 25 2017 12:17 PM | Updated on Sep 5 2017 4:51 PM

కోలీవుడ్లో సత్తా చాటిన మహేష్..!

కోలీవుడ్లో సత్తా చాటిన మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతోంది.

ఇప్పటికే స్పైడర్ తెలుగు రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తుండగా, తాజాగా తమిళ రైట్స్ కూడా అదే స్థాయిలో అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ తొలిసారిగా స్ట్రయిట్ తమిళ సినిమా చేస్తుండం, మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుండటంతో స్పైడర్ తమిళ రైట్స్ 23 కోట్లు పలికినట్టుగా వార్తలు వస్తున్నాయి. వందకోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement
 
Advertisement
Advertisement