బాలీవుడ్ రాంబోగా హృతిక్ | Hrithik Roshan Finally Given His Nod For Hindi Remake Of Rambo | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ రాంబోగా హృతిక్

Mar 10 2016 10:44 AM | Updated on Sep 3 2017 7:21 PM

బాలీవుడ్ రాంబోగా హృతిక్

బాలీవుడ్ రాంబోగా హృతిక్

రాంబో పాత్రను సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ యాక్షన్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన ఈ ఐకానిక్ పాత్ర, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం...

రాంబో పాత్రను సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ యాక్షన్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన ఈ ఐకానిక్ పాత్ర, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికే నాలుగు భాగాలుగా రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ సీరీస్ త్వరలో ఇండియన్ స్క్రీన్ మీద సందడి చేయనుంది. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, రాంబో సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే రాంబో సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న సిద్దార్థ్, ఇండియన్ వర్షన్కు కావాల్సిన మార్పులు చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ రీమేక్లో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.  తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ మ్యాన్లీ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించాడు.

ఇప్పటికే సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హాలీవుడ్ మూవీ నైట్ అండ్ డే హిందీ రీమేక్ బ్యాంగ్ బ్యాంగ్లో హీరోగా నటించిన హృతిక్ మరోసారి అదే దర్శకుడితో హాలీవుడ్ రీమేక్కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న మొహంజోదారో చిత్రంలో నటిస్తున్న హృతిక్, త్వరలోనే రాంబో రీమేక్పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement