లవ్లీ జర్నీ | Howrah Bridge Audio Launch | Sakshi
Sakshi News home page

లవ్లీ జర్నీ

Feb 2 2018 12:17 AM | Updated on Feb 2 2018 12:17 AM

Howrah Bridge Audio Launch - Sakshi

రాహుల్‌ రవీంద్రన్‌, చాందినీ చౌదరీ

‘‘రేవన్‌ యాదు నా కోసం మంచి పాత్రను తీర్చిదిద్దారు. అందుకు ఆయనకు థ్యాంక్స్‌. ‘హౌరా బ్రిడ్జ్‌’ సినిమా బాగా వచ్చింది. అందుకే ప్రమోషన్స్‌ విషయంలో రాజీ పడటం లేదు. చాందిని, మనాలి చక్కగా నటించారు. శేఖర్‌ ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. ఈ సినిమా లవ్లీ జర్నీ’’ అని హీరో రాహుల్‌ రవీంద్రన్‌ అన్నారు. ఆయన హీరోగా చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్‌ హీరోయిన్లుగా రేవన్‌ యాదు దర్శకత్వంలో వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ఈఎమ్‌వీఈ స్టూడియోస్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘హౌరా బ్రిడ్జ్‌’.

శేఖర్‌చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘దర్శకుడిగా నా రెండో చిత్రం ‘హౌరా బ్రిడ్జ్‌’. సినిమా చాలా బాగా తీశాం’’ అన్నారు రేవన్‌ యాదు. హీరో నిఖిల్, ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, చాందినీ చౌదరి, శేఖర్‌ చంద్ర, హీరోలు నారా రోహిత్, నవీన్‌చంద్ర, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌  తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement