ముద్దు సీన్స్‌ చేయాలని ఒత్తిడి తెచ్చారు.. కానీ, అతను మాత్రమే వద్దన్నాడు: చాందిని | chandini chowdary comments on rahul ravindran | Sakshi
Sakshi News home page

ముద్దు సీన్స్‌ చేయాలని ఒత్తిడి తెచ్చారు.. కానీ, అతను మాత్రమే వద్దన్నాడు: చాందిని

Nov 15 2025 8:30 AM | Updated on Nov 15 2025 11:17 AM

chandini chowdary comments on rahul ravindran

మన విశాఖ అమ్మాయి చాందిని చౌదరి ఒకప్పడు యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిలిమ్స్‌ తీస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, 2020లో సుహాస్ సరసన కలర్ ఫోటో సినిమా తనను యూత్‌కు దగ్గరచేసింది. తాజాగా సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో వచ్చేసింది ఈ క్రమంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  ‘హౌరా బ్రిడ్జి’ సినిమా గురించి పరోక్షంగా కామెంట్‌ చేసింది. తనకు కథ చెప్పినప్పుడు కిస్‌ సీన్స్‌ గురించి చెప్పకుండా   షూటింగ్‌ సమయంలో వాటి గురించి డిమాండ్‌ చేశారని గుర్తుచేసుకుంది.

‘హౌరా బ్రిడ్జి’ సినిమాలో చాందిని చౌదరికి జోడీగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ నటించాడు. ఈ సినిమా గురించి ఆమె పరోక్షంగా ఇలా చెప్పింది. 'అప్పటికే అర్జున్ రెడ్డి విడుదల కావడంతో పాటు పెద్ద సక్సెస్ అయిపోయింది. ఈ మూవీ  మాదిరే హౌరా బ్రిడ్జిలో కూడా మేకౌట్ సీన్స్,  కిస్ సీన్స్ పెడితే పెద్ద హిట్‌ అవుతుందని అనుకున్నారు. అలా నటించాలని నాపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. మొదట నాకు కథ చెప్పినప్పుడు ముద్దు సీన్ల గురించి చెప్పలేదు. కానీ, దర్శకుడు ఏం చెప్పినా సరే చేయాలి. లేదంటే చెడ్డపేరు వస్తుంది. దీంతో చాలా భయపడిపోయాను. ఆ సమయంలో నా కాళ్లుచేతులు వణికిపోయాయి. దర్శకుడు, నిర్మాత ఇంకో కొందరు నా వద్దకు వచ్చి ముద్దు సీన్స్‌ చేయాలని ఒత్తిడి తెచ్చారు. సినిమా ప్లాప్‌ అయితే, నీదే బాధ్యత అంటూ హెచ్చరించారు. 

నాకు ఏం చేయాలో తెలియలేదు. అదే సమయంలో నాతో నటించే వ్యక్తిని కూడా అడిగారు. కానీ, అతను మాత్రం ముందు అమ్మాయి అనుమతి తీసుకోండి అని సూచించారు. కానీ, వీళ్లు మాత్రం అమ్మాయిది ఏముంది సార్‌ చేయమంటే చేసేస్తుంది అంటూ మాట్లాడారు. అయితే, కొంత సమయం తర్వాత తను ఓకే చెప్పినా సరే కిస్‌ సీన్స్‌ నేను చేయనని అతను చెప్పాడు. దీంతో నేను ఊపిరి పీల్చుకున్నాను.'అని చాందినీ గుర్తుచేసుకుంది. అయితే, సినిమా పేరు ఏది అనేది ఆమె చెప్పలేదు. కానీ, అర్జున్‌ రెడ్డి సినిమా సమయంలో విడుదలైంది మాత్రం  ‘హౌరా బ్రిడ్జి’నే అంటూ నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement