దేవుడా.. రేపు ఎండలు వచ్చేలా చూడు! | Hope tomorrow is a bright and sunny day: B-Town prays for Chennai flood victims | Sakshi
Sakshi News home page

దేవుడా.. రేపు ఎండలు వచ్చేలా చూడు!

Dec 2 2015 7:38 PM | Updated on Sep 3 2017 1:23 PM

దేవుడా.. రేపు ఎండలు వచ్చేలా చూడు!

దేవుడా.. రేపు ఎండలు వచ్చేలా చూడు!

భారీ వర్షాలతో ఛిన్నాభిన్నమైన చెన్నైకి అండగా బాలీవుడ్‌ ప్రముఖులు ముందుకొచ్చారు.

భారీ వర్షాలతో ఛిన్నాభిన్నమైన చెన్నైకి అండగా బాలీవుడ్‌ ప్రముఖులు ముందుకొచ్చారు. గత వందేళ్లలో కనీవినీ ఎరుగని వానలతో అల్లాడుతున్న చెన్నై వాసులు త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. చెన్నై వాసుల కష్టాలకు  చలించిపోతూ చాలామంది బాలీవుడ్‌ సెలబ్రిటీలు ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు. బాధితులకు సాయమందించాల్సిందిగా అన్ని వర్గాల వారిని కోరారు. వానలు నిలిచిపోయి కష్టాలు త్వరగా తొలగిపోవాలని ఆకాంక్షించారు.

ఈ రోజంతా కురిసిన వానలు చెన్నైను చెరువులా మార్చేసినా నేపథ్యంలో రేపైనా ఎండలు కాసి.. పరిస్థితి కాస్తంతా మెరుగుపడాలని, చెన్నైవాసులకు ఊరటనివ్వాలని బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌తోపాటు పలువురు బాలీవుడ్‌ తారలు ఆకాంక్ష వ్యక్తం చేశారు. చెన్నై వాసుల క్షేమం కోసం తామంతా ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. వారు ఏమన్నారంటే

'చెన్నై నీటమునిగిపోయింది. చెన్నైవాసుల భద్రత ఉండాలని.. త్వరగా పరిస్థితులు కుదుటపడాలని ప్రార్థిస్తున్నా.. ఈ కష్టకాలంలో స్వచ్ఛంద సహాయం వెల్లువెత్తడం హృదయాన్ని కదిలిస్తున్నది'
- అమితాబ్ బచ్చన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement