అమెజాన్‌ రక్షణకు హీరో భారీ విరాళం

Hollywood Hero Leonardo DiCaprio Pledges Rs 36 Crore in Aid for Amazon Wildfires - Sakshi

ప్రపంచంలోనే అతి పొడవైన రైయిన్‌ ఫారెస్ట్‌ అయిన అమెజాన్‌ అడవుల్లో ఇప్పుడు కార్చిచ్చు రగులుకుంది. గత రెండు వారాలుగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు అక్కడి యంత్రాంగం సాయశక్తులా కృషి చేస్తోంది. ప్రతీ ఏటా ఈ అడవుల్లో వేల సంఖ్యలో అగ్ని ప్రమాదాలు సంభవించటం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమెజాన్‌ను కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలు విరాళాల సేకరణకు నడుం బిగించాయి.

తాజాగా ఈ కార్యక్రమానికి తనవంతు సాయం అందించడానికి హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో ముందుకు వచ్చారు. అమెజాన్‌లో తరుచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు మరికొంత మందితో కలిసి రక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం 5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 35 కోట్లు) రూపాయలను తన సేవా సంస్థద్వారా అందించనున్నట్టుగా ప్రకటించారు.

#Regram #RG @earthalliance #EarthAlliance, launched in July by @LeonardoDiCaprio, Laurene Powell Jobs, and Brian Sheth, has formed an emergency Amazon Forest Fund with a commitment of $5 million dollars to focus critical resources for indigenous communities and other local partners working to protect the life-sustaining biodiversity of the Amazon against the surge of fires currently burning across the region. Join Us. 100 percent of your donation will go to partners who are working on the ground to protect the Amazon. Earth Alliance is committed to helping protect the natural world. We are deeply concerned about the ongoing crisis in the Amazon, which highlights the delicate balance of climate, biodiversity, and the wellbeing of indigenous peoples. To learn more or to donate, please visit ealliance.org/amazonfund (see link in bio) Photos: @chamiltonjames, @danielbeltraphoto 2017

A post shared by Leonardo DiCaprio (@leonardodicaprio) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top